February 11, 2020

Tahasildar (1944): A Satirical Drama on Foreign Culture #TeluguCinemaHistory

Tahasildar (1944): A Satirical Drama on Foreign Culture #TeluguCinemaHistory

1944 సంవత్సరంలో ఏడు సినిమాలు విడుదల కాగా మిగతా వాటిని అధిగమించి ఆర్థికంగా ఘన విజయం సాధించిన చిత్రం జగదీష్ ఈ పతాకంపై దర్శకుడు వై.వి. రావు నిర్మించిన’ తాసిల్దార్’.

ఈ కథలో హీరో నరసయ్య ఒక తాసిల్దార్. సామాన్య కుటుంబానికి చెందిన కమలని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆమె ఫ్యాషన్లకు, ఇంగ్లీషు భాషకు దూరం. లేనిపోని ఆడంబరాలకు పోయె తాసిల్దార్ తన పేరు తారాలేగా మార్చుకుని పాశ్చాత్య నాగరికతతో ప్రభావితమైన రజినీ పట్ల ఆకర్షితుడవుతాడు. ఒక ఫంక్షన్లో కమల మన సాంప్రదాయం ప్రకారం ప్రవర్తించటంతో నవ్వుల పాలైన తాసిల్దార్ రజినిని రెండో భార్యగా ఇంటికి తీసుకొస్తాడు. ఇహ  అక్కణ్ణించి  ఇద్దరు భార్యల మధ్య ఘర్షణ మొదలవుతుంది. డబ్బు పట్ల మోజుతో  హీరో వంచన చేరిన రజనీ వల్ల ప్రభుత్వ పరమైన చిక్కుల్లో పడతాడు తాసిల్దారు. ఆ తరువాత కామేశం అనే స్నేహితుని హితబోధతో కళ్ళు తెరిచి పొరపాటును గ్రహించిన తాసిల్దార్ భార్య విలువను గుర్తిస్తాడు.

Click Here to go to Tahasildar (1944) Movie Page.

రసవత్తరమైన ఈ కథలో నెగటివ్ టచ్ ఉన్న హీరో పాత్రలో సి.హెచ్.నారాయణరావు. అతని భార్య కమలగా భానుమతి, ప్రేయసి రజనీ గా కమలాకోట్నీస్, స్నేహితుడు కామేశంగా దర్శకుడు వై.వి.రావు పోటీపడి నటించారు. ఇతర ముఖ్య పాత్రల్ని బలిజేపల్లి, బి.ఆర్.పంతులు, బెజవాడ రాజరత్నం పోషించారు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచన చేయగా హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి సంగీతాన్ని సమకూర్చారు. భానుమతి పాడగా ‘ మావారు తాసిల్దార్’ అన్న పాట హిట్ సాంగ్!

ఫారెన్ ఫ్యాషన్ మోజును వ్యంగ్యంగా చిత్రీకరించటం ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. ఈ ఛాయలు తరువాత వచ్చిన గృహప్రవేశం వంటి పలు చిత్రాలలో కనిపిస్తాయి. ఏమైనా జనాన్ని ఆకర్షించగల సినిమాలు తీయటంలో దిట్ట అని నిరూపించిన చిత్రం ‘ తాసిల్దార్’.

Source: 101 C, S V Ramarao

Spread the love:

Comments