May 28, 2020

Thene Manasulu (1964): First Telugu Social Film in Eastmancolor | Superstar Krishna’s Debut as Main Lead | #TeluguCinemaHistory

Thene Manasulu (1964): First Telugu Social Film in Eastmancolor | Superstar Krishna’s Debut as Main Lead | #TeluguCinemaHistory

మనసుల (మంచి, మూగ, తేనె, కన్నె) సీరీస్తో మంచి సినిమాలు తీసిన బాబూ మూవీస్ వారి మూడవ చిత్రం “తేనెమనసులు”, అందరూ కొత్త వారితోనే యీ చిత్రం తీసారు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, ఆత్రేయ, ముళ్ళపూడి వెంకటరమణ రచయితలు.

Click Here to go to Thene Manasulu (1965) Movie Page.

ఓ సన్నివేశంలో యీ సినిమా మీదే పెద్ద జోక్ వ్రాసారు ముళ్ళపూడి “వాళ్ళెనళ్ళో కొత్త వాళ్ళను పెట్టి సినిమా తీస్తున్నారట. ఏమిటో మహామహా వాళ్ళుంటేనే అంతంత మాత్రంగా వుంటున్నాయి. ఇహకొత్త వాళ్ళును పెడితే…” అంటూ ఓ పాత్రచేత సెటైర్గా అనిపిస్తారు. అయితే ప్రాక్టీకల్గా ఆ జోక్ కు విరుద్ధంగా సినిమా విజయవంతమయింది. సినిమా అయిదారురీళ్ళు నలుపుతెలుపుల్లో తీసి సంతృప్తి చెందక మంచి రిజల్టుకోసం తరువాత రంగుల్లో తీసారు ఆదుర్తి.

అనగనగా ఓ చిట్టిబాబు. అతనికి సీతతో పెళ్లి చూపులయ్యాయి. పెళ్ళి సెటలయ్యింది. అతను అమెరికాకెళ్ళాలంటే డబ్బుకావాలి, కాబట్టి ఎక్కువ కట్నం అడుగుతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో సీత తండ్రి దొంగతనం చేసి సమకూరుస్తాడు.

చిట్టిబాబు వివాహనంతరం అమెరికా వెళ్ళస్తాడు. చిట్టిబాబు స్నేహితుడు బసవరాజు డ్రిల్లు మాస్టారుగా పనిచేస్తుంటాడు. అతను, భానుమతి ప్రేమించుకొంటారు. విదేశాలనుంచి వచ్చిన చిట్టిబాబు వద్ద సెక్రటరీగా పని చేస్తుంది భానుమతి. పల్లెటూరి టైపులో వుండే భార్యను కాదని భానుమతిని ప్రేమిస్తాడు చిట్టిబాబు. అతనికి జ్ఞానోదయం కలగాలని అతన్ని ప్రేమిస్తున్నట్టు నటించి ఒకనాటి రాత్రివేళ తనలాగా సీతను అలంకరించి చిట్టిబాబు వద్దకు పంపిస్తుంది భానుమతి.

ఈ నాటకం తెలియని బసవరాజు భానుమతిని అనుమానించి చిట్టిబాబుతో పరస్పరం గొడవ పడతాడు. చివరకు చిట్టిబాబుకు భానుమతి బుద్ధిచెప్పటంతో భార్యను స్వీకరిస్తాడు చిట్టిబాబు. భానుమతితో బసవరాజు పెళ్ళి జరగటంతో కథ పూర్తవుతుంది.

ఇందులో సంఘర్షణకు అవకాశమున్న భానుమతి, చిట్టిబాబూ పాత్రల్లో సుకన్య రామ్మోహన్ నటించగా, హుషారైన పాటలు పాడుకొనే అవకాశమున్న బసవరాజు పాత్రలో (మాటిమాటికి తండ్రి అడ్డగాడిద అని తిడుతుంటాడు) కృష్ణ. సాత్త్యికమైన సీతగా సంధ్యారాణి నటించారు. ఇతర సహాయపాత్రల్లో కె.వి.చలం, వాణీబాల, పుష్పకుమారి,రాధాకుమారి, చలపతిరావు, జి.యస్.ఆర్.మూర్తి నటించారు. నూతననటి నటులను తీర్చిదిద్దటంలో, తర్ఫీదు యివ్వడంలో యెంతో శ్రమించారు సహదర్శకులు కె.విశ్వనాథ్.

ఆత్రేయ, దాశరధి వ్రాసిన గీతాలకు వినసొంపైన బాణీలను సమకూర్చారు సంగీత దర్శకులు కె.వి.మహదేవన్. ఇద్దరి కధానాయికల పైన చిత్రీకరించిన “చందమామ” రామ్మోహన్, సంధ్యారాణిల ప్రేమగీతం “దివినుంచి భుమికి దిగివచ్చి” సుకన్య, కృష్ణను టీజ్ చేసిన గీతం “మాస్టారు డ్రిల్లు మాస్టారు” (ఇందులో కృష్ణకు పద్మనాభం ప్లేబాక్ పదాలు వల్లించారు) జయశ్రీ నృత్య గీతం “ఎవరో ఎవరో నీవాడు” కృష్ణ, రామ్మోహన్ సుకన్యల త్రగళగీతం “దేవుడు నేనైపుట్టాలి” వీటిని చాలా అర్థవంతంగా చిత్రీకరించారు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు. మంచి ఫలితాన్నిచ్చిన సాహసవంతమైన ప్రయత్నం ‘తేనెమనసులు’.

ఈ సినిమాలో నటించిన రామ్మోహన్ హిందీ నటుడు దేవానంద్ స్టైల్లో వున్నాడని అతనికి ఉజ్వల భవిష్యత్తు వుందని నాటి సినీపండితుల అంచనాలన్ని తలకిందులు చేస్తూ కృష్ణ హీరోగా దూసుకుపోగా క్రమంగా రామ్మోహన్ తెరమరుగైనాడు. ఇదీ చిత్రసీమ విచిత్రం.

Babu Movies released an advertisement saying the film required newcomers in the lead roles, and thousands of aspiring actors auditioned. Hema Malini and Jayalalithaa, not yet the stars of Bollywood and Tamil cinema they would later become, were among those who auditioned, but both were rejected. Krishnam Raju too was an unsuccessful contender. The leading roles finally went to Krishna, Rammohan, Sandhya Rani and Sukanya. This was Krishna’s first film in a major role, after he appeared as an extra in the 1962 releases Padandi Munduku and Kula Gotralu.

Principal photography began at Saradhi Studios. The film was initially planned to be in black and white, but after seven to eight reels were shot, Adurthi decided to reshoot the entire film in Eastmancolor. Thene Manasulu thus became the first Telugu social film to be shot completely in colour. A few scenes required Krishna to ride a scooter, so actor Raavi Kondala Rao, at Adurthi’s request, taught Krishna to drive the scooter in the streets leading from Saradhi Studios to Sanathnagar. It took four days for Krishna to learn scooter driving.

Thene Manasulu was released on 31 March 1965. The film became a commercial success, running for over 100 days in theatres. Despite its success, among the four leads only Krishna attained stardom. Adurthi remade the film in Hindi as Doli (1969) which was also successful.

P.S: Lava Kusa (1963), the first full-length Telugu color film was not a “social”, i.e. a film having a contemporary setting.

Source: 101 C, S V Ramarao, Wiki

Spread the love:

Comments