May 25, 2020

Doctor Chakravarthy (1964): First Film to win the Nandi Award #TeluguCinemaHistory

Doctor Chakravarthy (1964): First Film to win the Nandi Award #TeluguCinemaHistory

1962 లో ఆంధ్ర ప్రభ వారపత్రిక నిర్వహించిన పోటిల్లో ప్రధమ బహుమతి పొందిన నవల కొడూరికౌసల్యదేవి వ్రాసిన “చక్రభ్రమణం”. ఆ నవల బహుమతి పొందటమేగాదు బహుళ పాఠకాదరణ పొందింది. దానిని సినిమాగా తీస్తే బాగుంటుందన్న ఆలోచన అటు సినీ పరిశ్రమలోనూ యిటు పాఠకుల్లోను కల్గింది. ఫలితంగా ఆ నవలను చిత్రంగా నిర్మించే హక్కులు పొందారు అన్నపూర్ణా అధినేత దుక్కపాటి మధుసూధనరావు. ఆయన అంతటితో వూరుకోకుండా ఏ పాత్ర ఎవరు ధరిస్తే బాగుంటుందని పాఠకులకు క్విజ్ పెట్టి, ఆ వచ్చిన ఫలితాలనుసరించి ప్రధాన పాత్రల్ని అందుకు అనుగుణంగా ఎంపిక చేశారు.

Click Here to go to Doctor Chakravarthy (1964) Movie Page.

చిత్రానికి ‘డాక్టర్ చక్రవర్తి’ అని నామకరణం చేసారు. దర్శకత్వ బాధ్యతల్నిఆదుర్తిసుబ్బారావుకు వప్పజెప్పారు. ఆత్రేయ సంభాషణలు వ్రాయగా యస్.రాజేశ్వరరావు సంగీత బాధతల్ని నిర్వహించారు. ఒక విధంగా చెప్పాలంటే యిది మానసిక సంఘర్షణకు సంబంధించిన యింటలెక్టువల్ మూవీ, దానిని సామాన్య ప్రేక్షకుని వద్దకు తీసుకువెళ్ళటంతో మొత్తం టీమ్ అంతా సఫలీకృతులయ్యారు.

డాక్టర్ చక్రవర్తి (అక్కినేని), డాక్టర్ శ్రీదేవి (కృష్ణకుమారి) పూర్వాశ్రమంలో ప్రేమికులు, చక్రవర్తి సోదరి సుధ (గీతాంజలి). కాన్సర్ వ్యాధివల్ల అమె చనిపోతూ నిర్మల (జానకి)ను పెళ్ళిచేసుకోవల్సిందిగా కోరుతుంది. దానిని మన్నించి చక్రవరి నిర్మలను పెళ్ళి చేసుకొంటాడు.

చక్రవర్తికి ఆప్తమిత్రుడు రవీంద్ర (జగ్గయ్య). అతని భార్య మాధవి (సావిత్రి) ఆమె రచయిత్రి, వారిద్దరిదీ అనుకూల దాంపత్యం. మరణించిన సుధను మాధవిలో చూసుకొంటాడు చక్రవర్తి, దీనికి చిలవలు పలువలు అపార్ధాలు కల్పించి సూర్యకాంతం వారి కాపురాల్లో జ్వాలను రగిలిస్తుంది. ఫలితంగా రవీంద్ర మిత్రుడు చక్రవర్తిని అనుమానించి అవమానిస్తాడు. పతాక సన్నివేశంలో రవీంద్ర జరిగిన పొరపాటును గ్రహించగా, శ్రీదేవి, చక్రవర్తిల సహాయంతో మాధవి పండంటి బిడ్డకు జన్మనిస్తుంది.

ఈ కథలో మాధవి సోదరుడు శ్రీధర్ గా గుమ్మడి, దుష్టభూమికలో సూర్యకాంతం హాస్య పాత్రల్లో పద్మనాభం, జయంతి, చలం చిత్రానికి వన్నె తెచ్చారు.

ఆరుద్ర గీతం “ఈ మౌనం, యీ బిడియం” ఆత్రేయ గీతాలు ” పాడమని నన్నడుగవలెనా, నీవులేక వీణ”; శ్రీశ్రీ గీతాలు “మనసున మనసై, ఎవరో జ్వాలను రగిలించారు” – రాజేశ్వరరావు మార్క్ మెలోడీతో నేటికీ శ్రోతల్ని అలరిస్తున్నాయి.

1964లో విడుదలైన యీ చిత్రానికి ఆ సంవత్సరము రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన నందీ ఎవార్డుల్లో బంగారు నంది గెల్చుకొంది. ఫలితంగా లభించిన యాభైవేల రూపాయల పెట్టుబడితో ఆక్కినేని – ఆదుర్తి “చక్రవర్తి చిత్ర” పతాకంపై “సుడిగుండాలు, మరోప్రపంచం” అనే ప్రయోజనాత్మక చిత్రాల్ని నిర్మించారు.

ఈ చిత్రం విడుదలయిన ప్రాంతల్లోనే అక్కినేని, అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై దేశాన్ని మనదేశపు సాంస్కృతిక రాయబారిగా సందర్శించారు. తన అనుభవాల్ని “నేను చూసిన అమెరికా” గ్రంధంలో వివరించారు.

The film was recorded as an Industry Hit at the box office. It is the first film to win the Nandi Award, instituted by Government of Andhra Pradesh in 1964. It inspired many people in India to become doctors.

Source: 101 C, S V Ramarao, Wiki

Spread the love:

Comments