April 18, 2020

Missamma (1955): Epic Classic #TeluguCinemaHistory

Missamma (1955): Epic Classic #TeluguCinemaHistory

నిరుద్యోగ సమస్యను కుటుంబపరమైన కథకు మేళవించి యించుమించు అవ్ని సన్నివేశాలను (సీరియస్ గా వుండే దృశ్యాలతో సహా) రచయిత చక్రపాణి స్టయిల్లో హాస్యపరంగా ఆవిష్కరించి ప్రేక్షకలోకాన్ని వినోదంలో ముంచెత్తిన విజయవారి చిత్రం ‘మిస్సమ్మ’.

Click Here to go to Missamma (1955) Movie Page.

నిరుద్యోగ యువకుడు రావు, మరో నిరుద్యోగ యువతి మేరి. అప్పాపురం జమిందారు నడిపే స్కూలుకు భార్యాభర్తలైన దంపతులు టీచర్లుగా కావాలనే ఓ ప్రకటన చూస్తాడు రావు, డేవిడ్ అనే నీచుడికి తన కుటుంబం బాకీపడడంతో మేరీ ఆ డేవిడ్నుంచి వేధింపులు ఎదుర్కోవల్సివస్తుంది. ఉదర పోషణార్ధం రావు-మేరి దంపతులుగా నటిస్తే ఆ ఉద్యోగాలు దక్కడమేగాక సమస్యలు తీరతాయి అని సూచిస్తాడు రావు. ముందుగా ఆవేశపడినా తర్వాత ఆలోచించిన మేరీకి ఆ సలహా నచ్చుతుంది. మాటకారి, విచిత్ర వేషధారి, అనరరీ బిచ్చగాడు అయిన దేవయ్య వారికి చేదోడువాదోడుగా వుండడానికి కీలకమైన సన్నివేశాల్లో కథ ముందుకు నడపడానికి వారితో కలిసి అప్పాపురం వస్తాడు.

ఇక అక్కడ్నుంచి అసలు కథ ఊపందుకుంటుంది. రావు-మేరీల మతాలు వేరు దాంతో ఒకరి ఆచార వ్యవహారాలతో మరొకరు సర్దుకుపోయే దిశగా పంతాలూ పట్టింపులు వస్తాయి. వారిని ఆప్యాయంగా చూసుకునే జమిందారు దంపతులు వారిద్దరిమధ్యా సయోధ్య కుదర్చడానికి తపనపడతారు. జమిందారు రెండోకూతురు సీతకు రావు సంగీతం చెప్పడం అసూయపడిన మేరీ, జమిందారు మేనల్లుడు రాజాకు (ఇతనో డిటెక్టివ్ కం స్కూలు కంస్సాండెంట్) సంగీతం నేర్పడం, దానిని నేర్చుకోవడానికి రాజు నానా యాతన పండడం తమాషాగా పుంటాయి. మరోవైపు రావు-మేరీల గత

చరిత్ర దేవయ్య ద్వారా తెలుసుకోవడానికి రాజు ప్రయత్నించడం, దేవయ్య తన ధైన ధోరణిలో రాజును ఎక్స్ప్లాయిట్ చేసి “తైలం’ అంటూ రాజా నుంచి డబ్బు గుంజటం ఓ సమస్యనుంచి బైటపడడానికి రావు యధాలాపంగా మేరీ నెల తప్పిందనడం, దాంతో జమిందారు భార్య మేరీకి సీమంతం ఏర్పాట్లు చేయడం, ఈలోగా గతంలో తప్పిపోయిన

జమిందారు మొదటి కూమార్తె మహాలక్ష్మి బహుశా మేరీ అనే సందేహంతో డిటెక్టివ్ ఆరాతీయడం, క్లయిబాక్స్ లో డేవిడ్ దుష్టత్వం బైటపడి మేరీ పెంపుడు తల్లిదండ్రులు వచ్చి మేరి తమ స్వంతకుమార్తె కాదనీ, తమకు దొరికిందనీ చెప్పడం, డిటెక్టివ్ రాజు సేకరించిన గుర్తులు, రుజువులు సరిపోవడంతో మిస్సమ్మ, ఆంటే మేరీయే మహాలక్ష్మి అని రుజువవడం, చివరకు జంటలు ఏకమవడంతో కథ ముగుస్తుంది.

కథలో మెలికలు లేకుండా సూటిగా హాయిగా చెప్పటం చక్రపాణిగారి స్కూలు ఇందుకు ఉదాహరణగా చిత్రం మొదట్లోనే తప్పిపోయిన మహాలక్ష్మికి పాదంమీద పుట్టుమచ్చవుందని చెప్పి, ఆ వెంటనే వచ్చే సన్నివేశంలో ఆ పుట్టుమచ్చ మీద క్లోజప్తో ప్రారంభించి మేరీయే మహాలక్ష్మి అని ముందే చెప్పేస్తాడు. అదీ కథలోని ముఖ్య పాత్రలకు తెలియచెప్పడం కథాకథన సారాంశం.

రావుగా యన్.టి.రామారావు, మేరీగా సావిత్రి, రాజుగా అక్కినేని నాగేశ్వరరావుగారు, జమిందారుగా యస్.వి.రంగారావు, ఆయన భార్యగా ఋష్యేంద్రమణి, రెండోకూతురు సీతగా జమున, దేవయ్యగా రేలంగి, డేవిడ్ గా రమణారెడ్డి, మేరీ తండ్రిగా దొరస్వామి, రాజు అసిస్టెంట్గా బాలకృష్ణ, స్కూలుమాస్టర్ కమ్ నాటు డాక్టరుగా అల్లు రామలింగయ్య, నాయికా నాయకుల్ని ఉద్యోగాలకోసం ఇంటర్వ్యూ చేసే సన్నివేశంలో గుమ్మడి, ఒకరేమిటి అందరూ ఆఖండులే అన్నంత హాయిగా నటించి, నవ్వించారు.

చిత్రానికి ప్రాణం చక్రపాణి స్క్రిప్టు. మాటలన్నీ హాస్యరస పాకంలోంచి బైటపడ్డ అసగుళకలే, పాటల్ని విజయ ఆస్థానకవి పింగళి నాగేంద్రరావు రాయగా సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు వాటిని రసరమ్యంగా స్వరపరిచారు. హీరోకు ఏ.యం.రాజా, నాయికకు పి.లీల, రెండో నాయిక జమునకు సుశీల, తమ గళాన్ని అందించారు. వారు ఆలపించిన ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, రావోయి చందమామా మా వింతగాధ వినుమా, ఏమిటో ఈ మాయ ఓ చల్లనిరాజా, బాలనురా మదనా, తెలుకొనవే యువతీ, కావాలంటే ఇస్తానే, పాటలు హృద్యంగా, హాయిగా వుంటాయి. రేలంగి ధర్మం చెయ్ బాబు గీతాన్ని స్వయంగా పాడారు. మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం నిర్వహించారు.

కథలోని ప్రతి సన్నివేశాన్ని హాయిహాయిగా తెరపై ఆవిష్కరించిన ఖ్యాతి దర్శకుడు యల్.వి.ప్రసాద్ కు దక్కుతుంది.

ఈ చిత్రానికి సంబంధించిన విశేషాల్లోకి వెళితే 1955 జనవరి 12న విడుదలయిన ఈ చిత్రాన్ని ‘మిస్సియ్యమ్మ’ పేరుతో తమిళంలోనూ, ‘మిస్ మేరీ’ పేరుతో హిందీలోనూ నిర్మించారు. మొదట కథానాయికగా భానుమతిని అనుకున్నారు. కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత కారణాంతరావల్ల భానుమతి విరమించుకోగా సావిత్రికి హీరోయిన్ గా ప్రమోషన్ లభించింది. ఆమె ధరించాల్సిన పాత్ర జమునకు లభించింది పెళ్ళయిన దంపతులు పెళ్ళి కాలేదని రివర్స్లో నటించి ఉద్యోగాలు సంపాదించిన పెళ్ళిపుస్తకం కథకు మూలప్రేరణ ‘మిస్సమ్మ’ చిత్రకథ. అలాగే అందులోని ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ అన్న గీతాన్ని ఇటీవల ‘ఖుషి’ చిత్రంలో మరో రూపంలో ఉపయోగించడం చెప్పుకోదగ్గ విశేషం. ఈ చిత్రం తమిళ వెర్షన్ చిత్రీకరించినప్పుడు సావిత్రి-జమెనీగణేశన్ల మధ్య నిజంగానే ప్రేమ చిగురించి వివాహం జరగడం, అది భవిష్యత్ లో ఆమెకు శాపంగా పరిణమించడం అందరికీ తెలిసిందే.

“బ్రతుకు తెరువు, దేవదాసు” వంటి హిట్ చిత్రాలలో నటించిన నాగేశ్వరరావు ఈ చిత్రంలో హాస్యపాత్రను అంగీకరించడం వెనుక కారణం యేమంటే.. రోటీన్ కు భిన్నంగా ఉండే పాత్ర పోషించి మెప్పించాలన్న తపన, ఆ వేషాన్ని తమిళంలో హాస్యనటుడు తంగవేలు, హిందీలో కిశోర్ కుమార్ పోషించారు. మూడు భాషల్లోను జమన నటించటం చెప్పుకోదగ్గ విశేషం. తెలుగులో రాజేశ్వరరావు స్వరపరచిన “బృందావవమది అందరిది” ట్యూన్నే హిందీలో ఉపయోగించుకున్నారు.

Source: 101 C, S V Ramarao

Spread the love:

Comments