May 12, 2020

Iddaru Mitrulu (1961): First Dual Role Film in Tollywood #TeluguCinemaHistory

Iddaru Mitrulu (1961): First Dual Role Film in Tollywood #TeluguCinemaHistory

బెంగాలీలో హిట్ అయిన చిత్రం ‘తాషేర్ ఘర్’ అన్నపూర్ణ అధినేత దుక్కిపాటి మధుసూధనరావు దృష్టిని ఆకర్షించింది. అంతే, తెలుగులో అన్నపూర్ణ పతాకంపై “ఇద్దరుమిత్రులు”గా రూపొందింది. 1961లో జనవరిలో వెలుగునీడలు విడుదలయితే అదే సంవత్సరం డిసెంబరు 29వ తేదీన ‘ఇద్దరు మిత్రులు’ విడుదలయి విజయభేరి మ్రోగించింది. ఎన్నో ప్రత్యేకతలున్న చిత్రం ‘ఇద్దరు మిత్రులు’.

Click Here to go to Iddaru Mitrulu (1961) Movie Page.

అజయ్ బాబు కోట్ల ఆస్తికి అధిపతి. అయినా మనశ్శాంతి లేదు. విజయబాబు తెలివితేటలున్న పేదవాడు. కారు ఏక్సిడెంటులో యిద్దరు కలుసుకుంటారు. ఆశ్చర్యంగా వారిద్దరూ ఒకే పోలికలో వుంటారు. అజయ్, విజయ్ ను తనతో తీసుకెళ్ళి సమస్యలు వివరిస్తాడు. అది విన్న విజయ్ నేనే మీ పరిస్థితిలో వుంటే… ఏదో ఘనకార్యం చేయగలనన్న ధీమా తెలియపరుస్తాడు. అంతే: ఆ ఆలోచన అజయ్ కు నచ్చి యిద్దరూ స్థానాలు మార్చుకుంటారు. ఈ రహస్యం తరువాత అజయ్ మేనత్త (జి.వరలక్ష్మి)కి మాత్రం తెలుస్తుంది.

అజయ్ స్టానంలోకి పచ్చిన విజయ్ మేనేజర్ భానోజీ (గుమ్మడి) చేస్తున్న అక్రమాలను అడ్డుకట్ట వేయటంతో బాటు ఆతని కుమార్తె సరళను ప్రేమించి, ఆమె అభిమానాన్ని చొరగొంటాడు.

విజయ్ స్టానంలోకి పచ్చిన ఆజయబాబు, విజయ్ సోదరి మీనా వివాహబంధాన్ని చక్కదిద్దటంతో బాటు ఆమె స్నేహితురాలు పద్మ ప్రేమను పొందుతాడు.

పతాక సన్నివేశంలో అజయ్, విజయ్ల పన్నాగం తెలిసిన భానోజీ అజయ్ని ఆరెస్టు చేయించబోవటం నిజమైన అజయ్ (విజయ్) వచ్చి సమస్యను పరిష్కరించటంతో ఇద్దరు మిత్రలు పెళ్ళివేడుకతో కథ సుఖాంతమవుతుంది. రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం, పద్మనాభం హాస్య సన్నివేశాల్ని పండించారు.

ఈ చిత్రానికి సంబంధించి విశేషాలున్నాయి. అంతకుముందు అన్నపూర్ణ చిత్రాల్లో నాయికగ నటించిన సావిత్రి నటించలేదు, ఆంతేగాక అప్పటినరకూ నర్తకీగా నటించిన రాజసులోచన, ఇ.వి. సరోజు కథానాయికలుగా నటించారు. నూతన నటిగా శారద సినీరంగ ప్రవేశం చేసారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావు ఈ చిత్రంతో అన్నపూర్ణలో ప్రవేశించి ఆత్యధిక సంఖ్యలో (ఆ సంస్థ నిర్మించిన యెనిమిది చిత్రాలకు సంగీతాన్ని అందించారు. చిత్రంలోని అన్ని పాటలు మాధుర్యంతో నిండి యీనాటికీ శ్రోతలకు ఆనందాన్ని ఆందిస్తున్నాయి. దాశరథి గీత రచయితగా (నవ్వాలి నవ్వాలి, ఖుషీ ఖుషీగా నవ్వుతూ) పరిచయమాయ్యారు. ఇతర గీతాల్ని శ్రీశ్రీ,కొసరాజు వ్రాసారు. నిర్మాతలను యిబ్బంది పెట్టే రచయిత ఆత్రేయకి గుణపాఠం చెప్పాలని యీ చిత్రం ద్వారా ప్రముఖ నాటక రచయిత కొర్రపాటి గంగాధరరావుచే సంభాషణలు వ్రాయించారు.

ఈ చిత్రానికి హైలైట్ అక్కినేని ద్విపాత్రాభినయనం, అందంగా చిత్రీకరించిన కెమేరామన్ సెల్వరాజ్ పనితనం, ప్రతి ఫ్రేమును, సన్నివేశాన్ని ఎఫక్టివ్గా చిత్రీకరించిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, వారిద్దరు ప్రశంనీయులే.

It was Akkineni Nageswara Rao’s first movie in a dual role. Jagannatha Rao, a small time actor, played body double for ANR. Interestingly in one scene when the two ANRs meet at Ritz Hotel, Hyderabad, the film’s assistant director K.V. Rao played the ‘dupe’ to ANR and thus he became the first actor to play a dupe to a dupe artiste.

Source: 101 C, S V Ramarao, The Hindu

Spread the love:

Comments