May 10, 2020

Bharya Bhartalu (1961): National Award Winning Best Feature #TeluguCinemaHistory

Bharya Bhartalu (1961): National Award Winning Best Feature #TeluguCinemaHistory

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏ.వి.సుబ్బారావు నిర్మించిన యీ చిత్రం ద్వారా కె ప్రత్యగాత్మ దర్శకులుగా పరిచయమయ్యారు. నెగెటివ్ టచ్ వున్న హీరో పాత్రను నిర్వహించటానికి ముందుగా అక్కినేని నాగేశ్వరరావు యిష్టత చూపకపోయినా ఆయన్ని కధన విశేషంతో వొప్పించారు దర్శకులు.

Click Here to go to Bharya Bhartalu (1961) Movie Page.

సంపన్న కుటుంబంలో పుట్టి జోరుగా పుషారుగా కారులో షికార్లు కొడుతూ,గర్ల్ ఫ్రెండ్ తో జాలీగా తిరిగే కధానాయకుడు ఆనంద్. చాలా సింపుల్గా వుంటూ టీచరు వుద్యోగం చేస్తున్న శారద సంస్కారవంతురాలు, అందమైంది. ఆమె ప్లీడరు గుమాస్తా కూతురు, ఆనంద్ కన్ను శారదపై పడుతుంది. నయానాభయానా ఎన్ని రకాలుగా ఆనంద్ ప్రయత్నించినా లాభంలేక పోతుంది. తల్లిదండ్రులు ఆనంద్ను వెళ్ళిచేసుకోమని తొందర పెడతారు. తాను పెళ్ళంటూ చేసుకొంటే శారదనే చేసుకొంటానంటాడు ఆనంద్. ఇహ ఇరుపక్షాల పెద్దల ప్రమేయంతో ఆనంద్-శారద దంపతులౌతారు.

మొదటి రాత్రి శారద ఆనంద్తో బలవంతాన నామెడలో తాళికట్టారు కానీ నా” మనసుము మీరు గెలవలేరు అని బాధపడుతుంది. అయితే నీ మనసులో నాకుచోటు దొరికే దాక వేచివుంటానంటాడు ఆనంద్.

మరునాడు ఆ యింట్లో జరిగిన ఓ వేడుకలో శారద వీణ పాట పాడాల్సి వచ్చినప్పుడు తన పరిస్థితిని పంజరంలో వున్న చిలుకతో పోలుస్తూ ‘ఏమని పొడెదనో యీవేళ’ అంటూ తన ఆంతర్యంలోని బాధను వెల్లడిస్తుంది. ఆనంద్ మనసు చిపుక్కుమంటుంది. దీనికి తోడు ఆనంద్ భార్యను షాపింగ్ కు తీసుకువెళితే అక్కడకువచ్చిన మిత్రులు ఆమెను అతని కొత్త ప్రియురాలుగా భావిస్తారు. దాంతో వారిద్దరి మనసులు య్యేంతో బాధపడతాయి. శారద అనారోగ్యంగా వున్నప్పుడు ఆనంద్ చేసిన సేవలతో ఆమెలో మార్పు వస్తుంది.

ఇలా వుండగా ఆనంద్ మాజీ ప్రియురాలు హేమ, బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నంలో ఆనంద్ ను తన యింటికి రప్పించుకొంటుంది. అయితే ఆనంద్ వచ్చి ఆమెను హెచ్చరించి తిరిగివెళ్ళిబోతుండగా హేమను ఎవరో హత్య చేస్తారు. ఆహత్యానేరంపై ఆనంద్ ను అరెస్టు చేస్తారు.

ఆనంద్ సోదరుడు లాయర్ రామానందం. శారద తనతో కలసి చిన్న నాటకాం ఆడి హేమ మాజీ ప్రియుడు ఆంజనేయులు ఆమెను హత్యచేసిన నిజాన్ని వెలికితీస్తారు. హేమ ‘మాస్క్’, వేసుకొని శారద నిజాన్ని రాబట్టటానికి సహకరిస్తుంది. అసలు హంతకుడు ఆంజనేయులుకి శిక్షపడగా భార్యాభర్తలు ఏకమౌతారు.

కథకు కీలకమయిన పాత్రాల్లో నాగేశ్వరరావు, కృష్ణకుమారి పోటీపడి నటించారు.వాంప్ హేమగా గిరిజ ఆమె ప్రియుడిగా పద్మనాభం. ఆనంద్ తల్లిదండ్రులుగా నిర్మిల, గుమ్మడి, లాయరుగా రేలంగి అతని భార్యగా సూర్యకాంతం, శారద తల్లిదండ్రులుగా సంధ్య, రమణారెడ్డి అతనికి మావగా చదలవాడ కుటుంబరావు నటించారు.

ఈ చిత్రానికి తెరవెనుక ప్రాణం పోసినవారిలో ముఖ్యులు సంగీత దర్శకులు ఎస్. రాజేశ్వరరావు. హీరో గీతం ‘జోరుగా హుషారుగా షికారలు పోదమా’, యుగళగీతాలు ‘ఓ ప్రియురాలా, జవరాలా, మధురం మధురం యీ సమయం’ సుశీల పాడిన వీణ పాట “ఏమని పాడెదనో యీ వేళ’ హాస్య గీతాలు రేలంగి, సూర్యకాంతంపై చిత్రీకరించిన ‘చూచిచూచి కళ్ళు కాయలేకాసాయి’, రమణారెడ్డి, సంధ్య పై చిత్రీకరించిన “ కనకమా నామాట వినుమా” అన్న పాటలు జనాధరణ పొందాయి.

ఆ రోజుల్లో అగ్ర కథానాయకులతో జమునకు విభేధాలు రావటంతో యీ చిత్రంలో కధానాయిక పాత్ర కృష్ణకుమారికి లభించిందంటారు. నిజానికి యీ చిత్రం కృష్ణకు మారి నటజీవితాన్ని ఓ మలుపు తిప్పింది. దానికి రాష్ట్రపతి  రజిత కమలం లభించింది. ఈ చిత్రాన్ని యల్.వి.ప్రసాద్ తమిళ, హిందీ భాషల్లో నిర్మించగా హిందీచిత్రం ‘హమ్రాహీ’లో జమున కధానాయికగా నటించటం విశేషం.

Bharya Bharthalu celebrated 100 day run and bagged the President’s silver medal as the best Telugu film at the National Film Awards. In a rare gesture, producer Dukkipati Madhusudana Rao felicitated producer A.V. Subbarao and his unit to celebrate the success of Bharya Bharthalu.

Source: 101 C, S V Ramarao

Spread the love:

Comments