May 11, 2020

Velugu Needalu (1961): Telugu Cinema Reminiscence #TeluguCinemaHistory

Velugu Needalu (1961): Telugu Cinema Reminiscence #TeluguCinemaHistory

1961 జనవరిలో “వెలుగునీడలు” చిత్రం విడుదలయిననాటి నుంచి యీనాటిదాకా ప్రతిసంవత్సరం రిపబ్లిక్డే (జనపరి 26) మరియు స్వాతంత్య్ర దినోత్సవంనాడు (ఆగస్టు 15) అటు రేడియోల్లో యిటు టి.వి ఛానల్స్ లోను తప్పనిసరిగా వినిపించి కనిపించే గీతం శ్రీశ్రీ ప్రాసిన “పాడవోయి భారతీయుడా” అనే గీతంలో అనినీతి, బంధుప్రీతి, చీకటి బజారు, ఆలుముకున్న నీ దేశం ఎటు దిగజారు” అంటూ 1961లో చెప్పిన నగ్న సత్యాలు నాటికీ నేటికి దినదినప్రవర్ధమానంగా వర్థిల్లాయి. దీనికి భిన్నంగా మనిషిలో ఆశావాదాన్ని ప్రోదిచేస్తూ అగధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏదీ తనంత తానై నీదరికి చేరరాదు, శోధించి సాధించాలి అదియో ధీరగుణం” అంటూ హితవు చెప్పారు.

Click Here to go to Velugu Needalu (1961) Movie Page.

ఆ విధంగా “వెలుగునీడలు” చిత్రంలోని యీరెండు గీతాలు రచయితగా శ్రీశ్రీని చిరంజీవిని చేసాయి.

రావు బహద్దూర్ వెంకట రామయ్య, భార్య కనకదుర్గమ్మ (ఎస్. వి. రంగారావు, సూర్యకాంతం) దంపతులకు సంతానం కలుగకపోయేసరికి సుగుణను చేరదీసి పెంచుతారు. అదృష్టవశాత్తు కనకదుర్గమ్మకు సంతానయోగం కలిగి వరలక్ష్మి పుడుతుంది. సుగుణపై వెగటు పుడుదుంది. దీన్ని గ్రహించిన వెంకటరామయ్య సుగుణ బాధ్యతల్ని గుమస్తా వెంగళప్పకు అప్పచెబుతాడు.

డాక్టరు చదువుతున్న సుగుణకు (సావిత్రి) రవితో (నాగేశ్వరరావు) పరిచయమవుతుంది. అది ప్రేమకుదారి తీస్తుంది. అతను కవితలు రాస్తుంటాడు. విదేశాల నుంచి వచ్చిన రఘు (జగ్గయ్య) సుగణ అంటే అభిమానం చూపిస్తాడు. రవికి క్షయ వ్యాధి వస్తుంది. తన పరిస్థితి తెలిసిన రవి సుగుణను వప్పించి రఘుతో పెళ్ళి జరిపిస్తాడు.

విధి వంచితుడైన రఘు ఆక్సిడెంట్ లో మరణిస్తాడు. రవి మదనపల్లి  శానిటోరియంలో వుండి ఆరోగ్య వంతుడవుతాడు. సుగుణ కోరిక మేరకు వరలక్ష్మి (గిరిజ)ని పెళ్ళి చేసుకుంటాడు. గతంలో రవి, సుగుణ ప్రేమించుకున్న విషయం తెల్సుకున్న వరలక్ష్మీ భర్తను అనుమానిస్తుంది. చివరకు నిజం తెల్పుకొని పశ్యాత్తపడుతుంది.

ప్రతి మనిషి జీవితంలో వెలుగునీడలు వుంటాయని వాటిని ధీరోదాత్తంగా ఎదుర్కొనాలని హితవు చెప్పే యీ చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని రసవత్తరంగా తీర్చిదిద్దారు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు. “కన్నీరు మానవుల్ని బ్రతికించ గలిగితే అది అమృతం కంటే కరువయ్యేది” – యిటువంటి ఆర్థ్రతతోకూడిన సంభాషణల్ని అందించారు ఆచార్య ఆత్రేయ. హేమాహేమిల వంటి నటీనటులందరూ సన్నివేశాలను రక్తి కట్టించారు.

పాడవోయి భారతీయుడా నృత్య గీతంలో రాజసులోచన అతిధిగా పాల్గొన్నారు. పెండ్యాల సమకూర్చిన సంగీతం హాయిగా వుంటుంది. అన్నట్టు “కలకానిది నిజమైనది రేడియో స్టేషన్ల పాట రికార్డింగ్ సందర్భంగా ఆర్కెస్ట్రా కండక్టుర్గా పెండ్యాల కనిపిస్తారు.

ఓ రంగయో పూలరంగయో, హాయి హాయిగా జాబిల్లి (శ్రీశ్రీ), శివగోవింద గోవింద, భలే భలే మంచిరోజులు (కొసరాజు) గీతాలు ప్రాచుర్యం పొందాయి.

నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, ట్రయాంగిల్ సన్నివేశాలు వారి సహజనటనా ప్రతిభకు పట్టంగట్టాయి.

Velugu Needalu was the debut film for Akkineni Nagarjuna. He played the role of ANR and Girija’s son and appears as a baby in the movie. A song was also filmed on him ( Challani vennela sonalu..) with Savitri and Girija carrying him on their shoulder and as the song progresses he grew into a small boy who peddles a tricycle and that role was enacted by the film’s assistant director K.V. Rao’s second daughter Chaya.

Source: 101 C, S V Ramarao, The Hindu

Spread the love:

Comments