April 29, 2020

Thodi Kodallu (1957): Award Winning Best Family Picture #TeluguCinemaHistory

Thodi Kodallu (1957): Award Winning Best Family Picture #TeluguCinemaHistory

శరత్ రాసిన చిన్న నవలల్లో చెప్పుకోదగ్గది ‘నిష్కృతి’. అన్నపూర్ణా పతాకంపై దొంగ రాముడు’ ఘనవిజయం తరువాత రెండో ప్రయత్నంగా ఈ ‘నిష్కృతి ఆధారంగా సినిమా తీయాలని నిర్ణయించుకొన్నారు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు. అయితే వ్యక్తిగత కారణాలవల్ల దర్శకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు కె.వి.రెడ్డి విముఖత. చూపారు. అప్పుడు ఆదుర్తి సుబ్బారావును దర్శకునిగా ఎంపికచేసి ఆ కథకు నిర్మాత దర్శకుడు, రచయిత ఆత్రేయ కలిసి స్క్రీన్ప్లే రూపొందించారు. మూలకథకు అవసరమైన చిన్నచిన్న మార్పులు కూడా చేశారు.

Click Here to go to Thodi Kodallu (1957) Movie Page.

పేరున్న లాయరు కుటుంబరావు ఈయనకు కోర్టు విషయాల్లో తప్ప మిగతా వ్యవహారాల్లో మతిమరుపు ఎక్కువ. ఆయన సోదరులు రమణయ్య, సత్యం. ఈ ముగ్గురి భార్యలూ అన్నపూర్ణ. అనసూయ, సుశీల, వీరే తోడికోడళ్ళు.

పల్లెటూర్లో చీట్లాట ఆడుతూ కాలక్షేపం చేసే రమణయ్య దంపతులకు పండుగకు రమ్మని పట్నం నుంచి కబురొస్తుంది. టౌనుకు వెళ్ళిన అనసూయ ఆ ఇంట్లో సుశీల పొందుతున్న ఆదరణ, ప్రేమ చూసి సహించలేకపోతుంది. ఈ ముగ్గురు తోడికోడళ్ళు పిల్లలద్వారా జరిగే చిన్నచిన్న గొడవలను పెద్దవిచేసి రాద్దాంతం చేస్తుంది. ఫలితంగా సత్యం, నుశీల, వారి అబ్బాయి బాబుతో సహా పల్లెటూరుకు వెళ్ళి వ్యవసాయం మొదలెడతారు. బాబుకు పెద్దమ్మ దగ్గర మాలిమి ఎక్కువ, అలాగే అన్నపూర్ణమ్మకు బాబు అంటే వల్లమాలిన అభిమానం. పండుగ సందర్భంగా బాబుకోసం పల్లెటూరుకు అన్నపూర్ణమ్మ సున్నుండలు పంపిస్తుంది, అనసూయ వాటిని అందకుండా చేస్తుంది. దాంతో అభిప్రాయబేధాలు ఇంకా పెరుగుతాయి.

ఇలావుండగా వైకుంఠం అనే దూరపు బంధువు రమణయ్యను వ్యాపారం పేరుతో లోబరుచుకుంటాడు. ఇందుకు అనసూయ సహకరిస్తుంది. రమణయ్య వైకుంఠం ప్రోత్సాహంతో నవనీతం అనే వేశ్య వలలో చిక్కి ఇల్లు గుల్ల చేసుకుంటాడు. చివరికి పెద్దాయన లాయరుపేరుతో ప్రోనోటు సృష్టిస్తాడు. అది తిరపతయ్య పేర వుంటుంది.

తిరుపతి పల్లెటూళ్ళో ప్రోనోటు గురించి గొడవ చేయగా సత్యం, సుశీల నగలు అమ్మి బాకీ తీర్చి అన్నగారి పరుపు నెలబెడతారు. పతాక సన్నివేశంలో ఈ విషయం చర్చకు రాగా వైకుంఠం ప్రోనోటు కాజేసి పారిపోతాడు. సత్యం పెంచిన కుక్క, జిమ్మీ వైకుంఠంను తరిమికొట్టి ప్రోనోటు తీసుకువస్తుంది. కుటుంబరావు నిజానిజాలు గ్రహిస్తాడు. అనసూయ పళ్చాత్తావంతో తోడికోడళ్ళు ఏకమౌతారు.

మహిళా సెంటిమెంట్తో ముడి పడ్డ టైటిల్ కు తగ్గట్టు కథాగమనం సాగుతుంది. వైకుంఠం పాత్రను, కుక్క పాత్రను కల్పించారు. ఆద్యంతం రక్తికట్టలా సీనేరియో రూపొందించారు. అందుకు తగ్గట్టు ప్రతి సన్నివేశాన్ని రసవత్తరంగా చిత్రీకరించారు. ఆదుర్తి సుబ్బారావు ఆయనకిది రెండవచిత్రం. ఇందులో నాగేశ్వరరావు (సత్యం), రంగారావు (కుటుంబరావు), రేలంగి (రమణయ్య), జగ్గయ్య (వైకుంఠం) కన్నాంబ (అన్నపూర్ణ), సూర్యకాంతం (అనసూయ), సానిత్రి (సుశీల), రాజసులోచన (నవనీతం) వంటి హేమాహేమీల్ని డైరెక్ట్ చేయడం ఒకవిధంగా ఆదుర్తికి దక్కిన సువర్ణావకాశం. దానిని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ఇతర పాత్రలో, కుటుంబరావు, నూస్టర్ కుందు, మాస్టర్ శరత్, అల్లు రామలింగయ్య నటించారు. పిల్లలపై చిత్రీకరించిన సన్నివేశాలు అత్యంత సహజంగా వున్నాయి.

Thodi Kodallu was the first film script in Telugu to be brought out as a novel. Penned by Ramchand, it was published by Dukkipati.

ఈ చిత్రం ద్వారా అన్నపూర్ణ సంస్థలో కెమెరామెన్గా ప్రవేశించిన సెల్వరాజ్ తరువాత వారు తీసిన 16 చిత్రాలకు పనిచేశారు. ఆత్రేయ రాసిన ‘కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా’ పాట హిట్. కొసరాజు, శ్రీశ్రీ, తాపీ ధర్మారావు ఇతర పాటలు రాశారు. మాస్టర్ వేణు అటు పల్లె వాతావరణం, ఇటు పట్టణ వాతావరణం రెండింటినీ సమన్వయించి నేపథ్య సంగీతం అందించారు. పిల్లలపై చిత్రీకరించిన గాలిపటం, ఎంతెంతదూరం, దసరాపండుగ పాటలు, సావిత్రి, అక్కినేని అత్యంత సహజంగా నటించిన ‘ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపేమున్నది’ రాజసులోచన-రేలంగిపై చిత్రీకరించిన ‘పొద్దయినా పొడవకముందే, నీ సోకుచూడకుండా నవనీతమ్మా’, సహకార వ్యవసాయాన్ని ప్రబోధించిన ‘నలుగురు కలిసి పొరుపులు మరిచి’ టౌనుపక్కకెళ్ళద్దురో’ నృత్యగీతం, సుశీల పాడిన అద్భుతగీతం ‘కలకాలమీ కలత తీరేదికాదు’… అన్ని పాటలూ సందర్భోచితంగా వుండి హాయి కలిగిస్తాయి.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించారు. తెలుగు చిత్రం ‘తోడికోడళ్ళు’ 1957 జనవరి 7న, తమిళ చిత్రం ‘ఎంగళ్వీట్టు మహాలక్ష్మి’ జనవరి 4న విడుదలయ్యాయి. తమిళ చిత్రంద్వారా ప్రముఖ దర్శకుడు శ్రీదర్ సంభాషణం రచయితగా పరిచయమయ్యారు. తెలుగుచిత్రం శతదినోత్సవం జరుపుకోగా తమిళచిత్రం రజతోత్సవం జరుపుకుంది.

“ తోడికోడళ్ళు” చిత్రానికి రాష్ట్రపతి యోగ్యతాపత్రం లభించింది.

అసలు కథలో ఒక ఆవు పాత్ర వుంది. అక్కినేని అభిమాని ఒకరు తన దగ్గర వున్న పెంపుడు కుక్క ఎన్నో ఫీట్స్ చేస్తుందని చెప్పగా దానిని చూసిన అక్కినేని, నిర్మాత దర్శకులు ఆ ఆవు పాత్రను కుక్కగా మార్చి ఆ అభిమాని ముచ్చట తీర్చారు.

Source: 101 C, S V Ramarao, The Hindu

Spread the love:

Comments