1945లో వాహినీ నిర్మించిన ఈ చిత్రం పేరు వినగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది భానుమతి పాడిన ‘ఓహోహో పావురమా’ పాట! ఈ పాట వెనుక ఓ కథ ఉంది. దానికి ముందుగా అసలు కథ గురించి క్లుప్తంగా- సుబ్బులు అనే వీధి నర్తకి మంచి నటిగా రూపుదిద్దుకునే ప్రయత్నంలో సుజాత గా మారుతుంది. ఆమె ప్రగతికి, భవిష్యత్తుకు సహకరించే మూర్తి మంచి రచయిత, పత్రికలో పని చేస్తుంటాడు. అతను వివాహితుడు. సుజాత తో పరిచయం ప్రేమగా మారటం ఫలితంగా అతని వివాహ బంధం దెబ్బతినే పరిస్థితి రావటం, భార్య కళ్యాణి తో గొడవ పడటం, సుజాత జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించడంతో కథ మరో మలుపు తిరగడం, చివరకు మూర్తి ‘ గృహమే కదా స్వర్గసీమ’ అని గుర్తించటం ఈ చిత్రానికి ముగింపు.
Debut of the legendary music director Ghantasala & the director of photography Marcus Bartley. It is the first Telugu film to be screened at the International Film Festival, Vietnam.
Click Here to go to Swargaseema (1945) Movie Page.
ఈ చిత్ర నిర్మాణానికి బియ్యం రెడ్డిని ప్రేరేపించిన అంశాలు రెండు – బెర్నార్డ్ షా రాసిన పిగ్మాలియన్,రీటాహేవర్తు నటించిన ‘బ్లడ్ అండ్ సౌండ్’ చిత్రం. ఆ చిత్రాన్ని చూపించి అందులో రీటాహేవర్తు పై చిత్రీకరించిన పాట తరహాలో ఒక పాట కావాలని కోరగా దానికి వాహిని కొలువులో సంగీతజ్ఞులైన నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు, అద్దేపల్లి రామారావు, బాలాంత్రపు రజనీకాంతరావు సినిమా చూసి తలా ఒకటి తయారు చేయగా రజనీకాంతరావు రాసి స్వరపరిచిన పాటనే దర్శకుడు ఎంపిక చేశారు. ఇది ఆ పాట తాలూకు కథ.
హొయలొలికించే నెరజాణ పాత్రలో మొదటిసారిగా అద్భుతంగా నటించిన భాగమతి అంతా ఆంధ్రాగ్రీటాగార్బో అని ప్రశంసించారు. కథానాయకుడిగా నాగయ్య, ఇతర ముఖ్య పాత్రల్లో జయమ్మ, సి.హెచ్.నారాయణరావు, లింగమూర్తి, కస్తూరి శివరావు నటించారు.
ఈ చిత్రం ద్వారా ‘హరేహ! లే ఎన్నెల చిరునవ్వుల యిరజిమ్ము బఠాణి’ అనే పాట ద్వారా నేపథ్య గాయకునిగా పరిచయమయ్యారు ఘంటసాల వెంకటేశ్వరరావు. తొలి అవకాశం లోనే భానుమతితో కలసి పాడటం విశేషం! విజయా నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి ఈ చిత్రానికి కథ, మాటలు సమకూర్చారు. మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం కొత్త దారులు తొక్కింది. ఇది నటిగా భానుమతిని ప్రొజెక్ట్ చేయటానికి సహకరించింది. పాటల్ని రజనీకాంతరావు, సముద్రాల రాఘవాచార్య రాయగా నాగయ్య సంగీతం సమకూర్చారు. మేలుకో కృష్ణా,ఓహో తపోధనా,మంచి దినమ నేడే, ఓహో నా రాజా వంటి పాటలు కూడా ప్రజాదరణకు నోచుకున్నాయి.
రజనీకాంతరావు, ఘంటసాల సినీ సంగీత రంగప్రవేశానికి, నటిగా భానుమతి స్థాయిని పెంచడానికి, బి.ఎన్ లో గల వైవిధ్య అభిరుచిని తెలపటానికి ఉపయోగపడ్డ ‘ స్వర్గసీమ’ నిర్మాతలకు లాభాల్ని కూడా అందించింది.

Source: 101 C, S V Ramarao