అంజలీ పిక్చర్స్ పతాకంపై నిర్మాత, సంగీత దర్శకుడు పి.ఆదినారాయణరావు నీర్మించిన మూడవ తెలుగు చిత్రం ‘సువర్ణసుందరి’. ఆయన ప్రజల నాడి తెలిసిన కథకుడు కూడా ఈ చిత్రానికి ఆయనే ‘ఆధిత్యన్’ పేరుతో కథ రూపొందించారు. ఒకవిధంగా అంతకుముందు వచ్చిన బాలరాజు, స్వప్నసుందరి చిత్రాలు ఈ కథకు ప్రేరణగా చెప్పొచ్చు. సామాన్య ప్రేక్షకుణ్ణి మూడున్నర గంటలసేపు వూహాలోకాల్లో విహరింపజేసి అద్భుతరసం ద్వారా వినోదాన్ని అందివ్వటమే ప్రధాన లక్ష్యం. అయితే దీనికి సుమధుర సంగీతం ప్రత్యేక అలంకారమై ఆ చిత్రాన్ని చిరస్మరణీయం చేసింది.
Click Here to go to Suvarna Sundari (1957) Movie Page.
మాళవ రాజకుమారుడు జయంత్ (అక్కినేని)గురువు దగ్గర విద్యలు పూర్తిచేసుకొని తిరిగి వచ్చే తరుణంలో గురుపుత్రి (సూర్యకళ) జయంత్ను తన కోరిక తీర్చమంటుంది. జయంత్ తప్పని హెచ్చరిస్తాడు. దాంతో ఆమె తనను బలాత్కరిస్తున్నాడని నింద వేస్తుంది. ఇది తెలిసిన మహారాజు రాజ్యబహిష్కరణ శిక్ష విధిస్తాడు. స్నేహితుని (పేకేటి) సహాయంతో తప్పించుకొన్న జయంత్ మరో రాజ్యానికి వెళతాడు.
అక్కడ జయంత్కు కైలాసం, ఉల్లాసం, చాదస్తం (రేలంగి, రమణారెడ్డి, బాలకృష్ణ) అనే ముగ్గురు పంచకులు తటస్థపడతారు. వారితో జరిగిన గొడవ ఫలితంగా విచిత్రశబ్దం వినిపించే గుహలో ప్రవేశించి మునీశ్వరుని మెప్పించి దండం, కమండలం, తివాచీ బహుమతిగా పొందుతాడు. వంచకులు ముగ్గురూ జయంత్ను బండరాళ్ళతో కొట్టి వాటిని తస్కరిస్తారు. అమృతపు కొలనులో పడ్డ జయంత్ కార్తీక పున్నమిరోజున స్పహలోకి వచ్చి దేవకన్యల నాట్యం చూసి ‘సువర్ణనుందరి’ని ప్రేమిస్తాడు. వారిద్దరి ప్రణయం ఇంద్రునికి తెలిసి ఆమెను భూలొకంలోనే బతకమని శపిస్తాడు. ఫలితంగా జయంత్ ఆమెను మరిచిపోతాడు. మరొశాప ఫలితంగా స్త్రీగా మారిపోతాడు.
జయంతి (రాజసులోచన) పేరుతో మరో రాజ్యంలో ప్రవేశించి ఆ రాకుమారికి (గిరిజ) దగ్గరవుతాడు. సువర్ణసుందరి ఒక బాబుకు జన్మనిచ్చి అతడు దూరమైపోగా మగవేషం ధరించి ఏనుగు పూలమాల వేయడంతో ఆ రాజ్యానికి మంత్రిగా వెళ్లింది. కథానాయకుడు శాపవశాత్తు స్త్రీగా మారటం, కథానాయిక పరిస్థితుల రీత్యా పురుషవేషం ధరించటం ఓ వైవిధ్యం. ఇహ దుర్మార్గులు ముగ్గురూ వారి వారి పద్దతుల్లో కథ నడిపిస్తారు.
తప్పనిసరి పరిస్థితుల్లో సుందరి జయంత్ని తాకగానే శాపఫలితంగా అతను శిలగా మారిపోతాడు. పెరిగిన కుమారుడు తివాచీపై వెళ్ళి విచిత్రకమలం తెచ్చి అతడికి తాకించగానే జయంత్ శాపనిముక్తుడవుతాడు.
ఈ కథలో నృత్యాలకు, సంగీతానికి, నటనకు, హాస్యానికి సమతూకం వుండేలా ట్రీట్మెంట్ తయారుచేశారు దర్శకుడు వేదాంతం రాఘవయ్య, కళాదర్శకులు వాలి రూపొందించిన ఇంద్రలోకం, రాక్షసుని నివాసం, వసంత ఘంటపం మొదలైన సెట్స్ కనువిందు చేస్తే, వాటిని ఫొటోగ్రాఫర్ యం.వి.రెహమాన్ నయనానందకరంగా చిత్రీకరించారు.
ఉత్తమ సాహిత్యాన్ని అందించారు సముద్రాల రాఘవాచార్య. ఆదినారాయణరావు స్వరకల్పన చేసిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. నేటికీ వాటి సువాసనలు వెదజల్లుతూనే వున్నాయి. ‘బంగారు వన్నెల రంగారు సంధ్య, జగదీశ్వరా పాహీ పరమేవ్వరానీ నీడలోన నిలచేనురా, పిలువకురా, బొమలమ్మా బొమ్మలు, రారే వసంతుడు ఏతెంచేవాళ్ళు, శంభో నా మొర వినరా.. పాటలు హిట్ కాగా గిలిగింతలు పెట్టిన హాస్యగీతం. ‘ఏరా మనతోటి గెలిచే వీరులెవ్వరురా…’ ఇక సినీసంగీత ప్రియుల్ని రసజగత్తులో వోలలాడించిన రాగమాలిక జిక్కి, ఘంటసాల ఆలపించిన హాయి హాయిగా అమనిసాగే’.
అంజలీదేవి నటన, నృత్యం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అక్కినేని జానపద కథానాయకునిగా ప్రణయ సన్నివేశాల్లోనూ, పతాక సన్నివేశంలోనూ తన ప్రత్యేకతను ప్రదర్శించారు. కామెడిని విలనీతో రంగరించటం చిత్రంలోని ప్రత్యేకత. ఆ మేరకు హాస్యనటత్రయం రేలంగి, రమణారెడ్డి, బాలకృష్ణ ఓహో అనిపించారు ఇతర సహాయ పాత్రల్లో గిరిజ, సీయస్పార్, రాజసులోచన, పేకేటి, కె.వి.యస్.శర్మ, సూర్యకళ, ఇ.వి.సరోజ, గుమ్మడి, మాస్టర్ బాబ్జి నటించారు. తెలుగుతో బాటు తమిళంలోను దీనిని (జెమినీ గణేశన్ హీరోగా) నిర్మించారు.
10.05.1957న విడుదలయిన ఈ చిత్రాన్ని పల్లెటూళ్ళనుంచి బళ్ళు కట్టుకువచ్చి చూసేవారు. సిల్వర్ జూబ్లీ జరుపుకొని కనకవర్షం కురిపించిన ‘సువర్ణసుందరి’ని హిందీలో అంజలి, అక్కినేని కాంబినేషన్లో నిర్మించి 7.11.1958లో విడుదల చేయగా అది కూడా ఉత్తరాదిన విజయభేరి మోగించింది. ఆదినారాయణరావును ఉత్తమ సంగీత దర్శకునిగా ఎంపికచేసి ఉత్తర భారత చిత్రసీమ ఘనంగా సత్కరించింది.

Anjali Pictures planned to dub the Tamil version of the movie in Hindi and invited Lata Mangeshkar to render the songs. She saw the movie and advised the producers to remake it in Hindi. When the Bombay film distributors expressed similar views, Manaalane Mangaiyin Baakkiyam was remade in Hindi as Suvarna Sundari with A. Nageswara Rao and Anjali Devi in the lead. It was huge hit too. When asked to select her 25 best renditions during the sliver jubilee year of her career, Lata Mangeshkar picked Muje Naa bela.. from Suvarna Sundari as one of the 25.
Source: 101 C, S V Ramarao