April 19, 2020

Rojulu Marayi (1955): Telugu Cinema Reminiscence #TeluguCinemaHistory

Rojulu Marayi (1955): Telugu Cinema Reminiscence #TeluguCinemaHistory

సహజ వాతావరణం, సహజ సన్నివేశాలు, మరింత సహజమైన పాత్రలు, గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే కథా కథనం, సంగీతం, పాత్రోచిత నటన ఇవన్నీ సారథివారి ‘రోజులుమారాయి’లో ప్రాణం పోసుకున్నాయి.

Click Here to go to Rojulu Marayi (1955) Movie Page.

పల్లెటూళ్లో ఓ బడుగు రైతు కోటయ్య, సేవాధర్మానికి నీతికి కట్టుబడ్డ మనిషి. అతని కొడుకు వేణు. నవతరానికి ప్రతినిధి. అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తిత్వం అతనిది. అతని సోదరి భారతి. ఆ వూరి కామందు సాగరయ్య, రైతులకు అప్పులిచ్చి వారిని పత్రాలు రాయించుకొని వారికి సహాయ పడ్డట్టు కన్పించి వారిని పీల్చి పిప్పి చేయటం అతని నై జం. ఆ వూరి కరణం సాంబయ్య, నాటురౌడీ పోలయ్య అతని ఆనుచరగణం, ఆ వూళ్లోనే మిలట్రీ నుంచి తిరిగివచ్చిన రత్నం అతని పెంపుడు కూతురు రాధ కూడా వుంటారు. ఆ పొరుగూరిలో వుండే గోపాలం కూడా అభ్యుదయ భావాలున్న యువకుడు, ఇతను హీరో వేణుకు స్నేహితుడు. ఇవి ముఖ్యపాత్రలు.

ధాన్యలక్ష్మిని చూసి మురిసిపోయిన కథానాయకుని బృందం ఆనందంతో వుండగా ఆ ధాన్యాన్ని సాగరయ్య తన బాకీ కింద జమవేసుకోవటంకోసం సాంబయ్యను నియమిస్తాడు. దీనికి వేణు అడ్డుపడినా కోటయ్య పెద్ద తరహాలో బాకీ కొంత తీర్చటానికి సిద్దపడతాడు. మిగతా బాకీ కోసం వేణూ సాగరయ్య వద్ద పూడిగం చెయ్యాలనగా అందుకు వేణూ అంగీకరించడు. వూళ్లో జరిగే అన్యాయాన్ని ఎదిరించే ధైర్యమున్న యువతి రాధ. ఆమెకు వేణుకు మధ్య చిన్నతగాదాతో పరిచయం మొదలయి ప్రేమగా మారి పెళ్లికి దారి తీస్తుంది. ఆమెకు మేనమామ అయిన రౌడీ పోలయ్య రాధను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించి భంగపడతాడు.

బంజరు భూముల పంపకంలో అవి అన్నీ బినామి పేర్లతో సాగరయ్య స్వాహా చేసి రైతులకు ఎగనామం పెడతాడు. ఈ విషయాన్ని కలెక్టరు ఎదుట బైటపెట్టిన వేణుని అందరూ అభినందిస్తారు.

వేణు చెల్లెలు భారతిని మూడు కాళ్ల ముదుసలికిచ్చి పెళ్లి చేయబోతే దానిని తప్పించి గోపాలంతో పెళ్లి నిశ్చయిస్తాడు వేణు. ఇక్కడ పెళ్లి హడావుడిలో అంతా వుండగా అక్కడ పంటకొచ్చిన చేనును చెరువుకు గండికొట్టి పంటను నాశనం చేయటానికి ప్రయత్నిస్తాడు సాగరయ్య, అప్పటికి రాధ గర్భవతి. పెళ్లికొడుకు సహా అందరూ కలిసి గండి పూడుస్తారు. పంట దక్కించుకుంటారు. దుష్టత్రయం సాగరయ్య,సాంబయ్య, పోలయ్య జైలుకు వెళ్లగా గోపాలం భారతిని పెళ్లాడటం, మగబిడ్డ జన్మించటంతో కథ ముగుస్తుంది.

సారధీవారి ఈ చిత్రంలో అంతకుముందు వారు నిర్మించిన ‘రైతుబిడ్డ’ ఛాయలు కొన్ని కన్పిస్తాయి. సారధీ నిర్మాత సి.వి.ఆర్.ప్రసాద్, కొండేపూడి లక్ష్మినారాయణ రూపొందించిన ఈ కథకు తాపీధర్మారావు నాయుడు మాటలు, కొన్ని పాటలు రాశారు కొసరాజు మరికొన్ని పాటలు రాశారు. మాస్టర్ వేణు సంగీతం అందించగా కమల్ఘోష్ ఛాయాగ్రహణాన్ని నిర్వహించారు.

‘ఒలియోవొలి పొలియోపొలి, ఇదియే హాయి కలుపుము చేయి, మారాజ వినవయ్యా మాగాణి నాటేటి మానవులకుండేటి చింత, ఇవిగో మన ఆశలు ఫలియించే’ పాటలు జనాధరణ పొందగా ‘ఏరువాక సాగారో’ అన్న న్నత్వగీతం సూపర్ హిట్ అయి ఆ పాటకు చేసిన వహిదా రహమాన్ కు అఖిల భారత స్థాయిలో నటిగా పేరొందటానికి కారణమయ్యింది. దర్శకునిగా తాపి చాణక్యకు ఇది రెండో చిత్రం.

అక్కినేని (వేణు), జానకి (రాధ), సి.యస్.ఆర్ (సాగరయ్య), రేలంగి (పోలయ్య) , రమణారెడ్డి (కరణం), వల్లం నరసింహారావు (గోపాలం), అమ్మాజీ (భారతి) ప్రధాన పాత్రలు పోషించగా కథానాయకుని తల్లిదండ్రులుగా హేమలత, పెరుమాళ్లు అత్యంత సహజంగా నటించారు అనటంకన్నా ఆ పాత్రల్లో జీవించారు అనటం సమంజసం.

14.4.1955న విడుదలయిన ఈ సిల్వర్ జాబ్లీ చిత్రం తమిళంలో ‘కాలం మారిపోచ్చు’ పేరిట నిర్మించబడింది. ‘ఏరువాక’ ట్యూన్ ను ఎస్.డి.బర్మన్ “బొంబాయికాబాబూ” చిత్రంలో ఉపయోగించుకున్నారు.

Waheeda Rehman

Rojulu Maaraayi was the first Telugu film to celebrate 100th day function in Hyderabad. The then Deputy Chief Minister, K.V. Ranga Reddy, presided over the function held at Rajeswar theatre. It was on his advice that Y. Ramakrishnaprasad built his Saradhi Studios in Hyderabad where Maa Inti Mahalakshmi (1959), the first Telugu film shot entirely in Hyderabad, was produced by P. Gangadhara Rao, who was the still photographer for Rojulu Maaraayi. Released on April 14, 1955, Rojulu Maaraayi celebrated a silver jubilee run.

Source: 101 C, S V Ramarao

Spread the love:

Comments