అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ చక్కగా వర్కవుట్ చేస్తే ఆ చిత్రం సూపర్ హిట్టే! అందుకు చక్కని ఉదాహరణ రాజ్యలక్ష్మి పతాకంపై సుందర్ లాల్ నహతా, డూండీ సంయుక్తంగా వి.మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందించిన “రక్తసంబంధం”.దీనికి మాతృక తమిళంలో భీమ్ సింగ్ రూపొందించిన “పాశమలర్”.
Click Here to go to Rakta Sambandham (1962) Movie Page.
రాజు-రాధ అన్నాచెల్లెళ్ళు. ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం. రాజు స్నేహితుడు ఆనంద్ ఒకసారి ఒక అపాయం నుండి రాధను రక్షిస్తాడు. వారిద్దరి మద్య ప్రేమ చిగురిస్తుంది. కొన్ని పరిస్థితులవల్ల రాజు పనిచేసే మిల్లు మూసేస్తారు. రాజు స్వయంగా వ్యాపారం ప్రారంభించి వృద్ధిలోకి వస్తాడు. తన చెల్లెలికి గొప్ప సంబంధం చెయ్యాలని రాజు ఆశ. తన చెల్లెలు ఆనంద్ ప్రేమించుకుంటున్నరని తెలిసి ఆనంద్ను కొట్టి అవమానిస్తాడు. అయితే చెల్లెలి ఆనందం కోసం క్షమాపణ చెప్పి వారి వివాహం జరిపిస్తాడు. రాజుకు కూడా వివాహమవుతుంది.
ఆనంద్ మేనత్త ఆనంద్ యింట్లో తిష్టవేసి ఆ కుటుంబంలో చిచ్చు పెడుతుంది. ఆ విధంగా ఆనంద్, రాధా వెరుగా వుంటారు. అక్కడ రాజుకు అమ్మాయి యిక్కడ రాధకు అబ్బాయి పుడతారు. రాజు భార్య కన్ను మూస్తుంది. రాజు ఆస్తంతా చెల్లెలి పేర వ్రాసి మనశ్శాంతి కోసం దేశాల వెంట తిరుగుతాడు. అయితే తను కోల్పోయిన మనశ్శాంతి తన చెల్లిలి వద్దే వుందని తిరిగివస్తాడు. దీపావళి రోజున రాధ కొడుకును రక్షించబోయి గుడ్డివాడౌతాడు. చివరకు అన్నాచెల్లెళ్ళు కలుసుకుంటారు.
ఇద్దరూ యీ లోకంలో తనువు చాలించి ఆ లోకంలో కలుసుకుంటారు. ఈ కథలో మేనత్త కాంతమ్మ కొడుకు అప్పారావు (రేలంగి) విశ్వనాధం (రమణారెడ్డి) అతని కూతురుగా (గిరిజ) హాస్యాన్ని అందించారు. ఎలక్షను గొడవలు ప్రేమ నిరాహారదీక్ష వంటి హాస్య సన్నివేశాలు గిలిగింతలు పెడతాయి. ఆనంద్ గా కాంతారావు, కాంతమ్మగా సూర్యకాంతం, రెండో కథానాయికగా దేవిక పాత్రోచితంగా నటించారు.
గంభీర సన్నివేశాలలోను హాస్య సన్ని వేశాలల్లోను ముళ్ళపూడి వెంకటరమణ కలం చిందులు తొక్కింది. (రచయితగా ఆయనకిది తొలి చిత్రం), ఘంటసాల సంగీతం చిత్రానికి ప్రాణం. అనిశెట్టి వ్రాసిన “చందురుని మించి అందమొలకించు చిట్టి పాపాయివే (ఈ పాటను చిత్రీకరించిన కెమెరామెన్ సి.నాగేశ్వరరావు ప్రశంసనీయులు) ఆరుద్ర వ్రాసిన బంగారు బొమ్మరావేమే పాటలు సూపర్ హిట్ (ఒరిజినల్ తమిళ ట్యూన్స్నే వుపయోగించుకున్నారు). 1962 జూన్ నెలలో వచ్చిన “గుండమ్మకథ”లో యన్.టి.ఆర్. సావిత్రి జంటగా నటిస్తే ఆదరించిన ప్రేక్షకులు 1962 ఆక్టోబర్లో వచ్చిన యీ చిత్రంలో వారిద్దరు అన్నాచెల్లెళ్ళుగా నటించినా ఆదరించారు. అంటే కథాబలం అంత గొప్పది.


NTR was 39 and Savitri was 26 when the film was released. NTR knew V. Madhusudana Rao since their theatre days. After NTR entered the film industry, Madhusudana Rao took his place in the National Art Theatres stage plays and acted as Salim and other characters that NTR used to perform. As a mark of gratitude, Mullapudi Venkata Ramana dedicated his book Cineramaneeyam Part I to Doondy.
Source: 101 C, S V Ramarao, The Hindu