27-4-1950న విడుదలై విజయభేరి మోగించిన తొలి ముల్టీస్టారర్ బి. ఏ. ఎస్. అండ్ శోభనాచల పతాకంపై బి. ఏ. సుబారవు తొలిసారిగా దర్శకత్వం వహించిన జానపద చిత్రం ‘పల్లెటూరిపిల్ల’. ‘పిజారో’ అన్ననాటకం దీనికి మాతృక.
అదొక పల్లెటూరు. ఆ వూళ్ళో హాయిగా పైరు గాలి పీలుస్తూ చెంగుచెంగున గంతులు వేసే కథానాయిక శాంత. ఆమెను ప్రేమిస్తాడు ఆమె ఇంటి పొరుగున ఉన్న వసంత్. ఈ విషయం శాంతకు తెలియదు. ఆ ప్రాంతంలో కంపన దొర అనే దుర్మార్గుడు తరుచుగా ఆ చుట్టుపక్కల గ్రామాలపై పది కప్పం కట్టమని దోచుకుంటాడు.
Click Here to go to Palletoori Pilla (1950) Movie Page.
అతని అనుచరుల్లో ముఖ్యుడు జయంత్. ఒకసారి జయంత్ శాంత వున్న గ్రామంపై దాడిచేస్తాడు. పల్లెటూరి పిల్ల శాంత జయంత్ కు చెంపదెబ్బ కొట్టి, పేదల్నికొట్టి దొరకు కట్టబెడితే నీకేమి లాభం, అని నిలదీస్తుంది. ఈ సంఘటన జయంత్ లో మార్పు తెస్తుంది. కంపన కొలువు వదిలి పెట్టి గ్రామం చేరుకొని యువకుల్ని వీరులుగా తీర్చిదిద్దుతాడు. క్రమేపి శాంతకు జయంత్ కు మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇది చూసి భరించలేని వసంత్ జయంత్ పై చేయి చేసుకుంటాడు. అప్పుడు శాంత తన మనసులోని మాట చెప్పగా త్యాగబుద్ధితో వసంత్ వారికి పెళ్లి జరిపిస్తాడు. ఆగ్రహించిన కంపందొర గ్రామాన్ని నాశనం చెయ్యాలని పథకం వేస్తాడు. వద్దని వారించిన తాతను హతమారుస్తాడు.
గ్రామంపై దాడిచేసిన కంపన దొర అనుచరులు జయంత్ కు పుట్టిన బిడ్డను ఎత్తుకెళ్తారు. జయంతా కూడా వాళ్ళకు బందీ అవుతాడు. శాంత వసంత్ ను అనుమానిస్తోంది. అప్పుడు వసంత్ కంపనదొర స్థావరానికి వెళ్లి జయంత్ ని విడిపించి బిడ్డను రక్షించి ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతాడు. క్లుప్తంగా ఇది కథ.
ఇందులో త్యాగపూరితమైన వసంత్ పాత్రలో నాగేశ్వరరావు, జయంత్ గా యన్.టి.ఆర్., కథానాయిక అంజలిదేవి, తాతగా ఎస్.వి. రంగారావు, కంపనదొరగా ఏ. వి. సుబ్బారావు నటించారు. నల్లరామ్మూర్తి, సీతారాం లప్పాం టప్పాం అనే హాస్య పాత్రల్ని పోషించారు. ప్రముఖ దర్శకులు తాపీ చాణక్య, సంగీత దర్శకులు టి. వి. రాజు ఈ చిత్రంలో గూడాచారి పాత్రలో కొద్దిసేపు కనిపిస్తారు. ఈ విధంగా ఇది తొలి ముల్టీస్టారర్ చిత్రం అయింది.
తాపీ ధర్మారావు రచన చేసిన ఈ చిత్రానికి తొలిసారిగా ఆదినారాయణరావు సంగీతం అందించడమేకాక కొన్నిపాటలు కూడా రాసారు.శాంత వంటి పిల్లలేదోయి, పల్లెసీమల బ్రతుకే ఆనందమోయి, వీరకంపనా, ధీర కంపనా అనే లక్ష్మీకాంతం చేసిన నృత్యగీతాలు పాపులర్ అయ్యాయి.
తరువాత కాలంలో ఈ కథను జెమినీ వాసన్ హిందీలో దిలీప్ కుమార్, దేవానంద్, బీనా రాయ్ ల కంబినేషన్లో ‘ఇన్సానియత్’ పేరిట నిర్మించగా అది కూడా ఘనవిజయం సాధించింది.

ఈ చిత్రంలో కీలకమైన వసంత్ పాత్రకు ముందుగా ఈలపాట రఘురామయ్యను బుక్ చేశారు. కొంత షూటింగ్ జరిగాక ఫైటింగ్ సన్నివేశాలు నేను చేయలేనని రఘురామయ్య చెప్పటంతో ఆ పాత్రకు నాగేశ్వరరావును బుక్ చేశారు.
For an action sequence, N. T. Rama Rao refused to let the director employ a stunt double and fought with a violent bull himself. The director had told Rama Rao only to catch the horns of the Australian bull he had to fight (to save Santha and Vasanth), but Rama Rao literally fought with the savage bull which ultimately threw him to the ground, fracturing his right hand. Despite being told to take rest, Rama Rao reported for the shoot the very next day. Two fractures later, Rama Rao was still shooting, wearing full sleeves to cover the bandages.
Source: 101 C, S V Ramarao