May 21, 2020

Nartanashala (1963): Tollywood’s Most Fulfilling Film #TeluguCinemaHistory

Nartanashala (1963): Tollywood’s Most Fulfilling Film #TeluguCinemaHistory

మహాభారతంలో మహత్తర రసవత్తర ఘుట్టం నర్తనశాల. ఆ కధను అంత రసనత్తరంగా తెరకనువదించిన ఘనులు రచయిత సముద్రాల రాఘవాచార్య, దర్శకులు కమలాకర కామేశ్వరరావు. అసలు యీ చిత్ర నిర్మాణానికి పూనుకొన్న రాజ్యం పిక్చర్స్ అధినేతలు లక్ష్మీరాజ్యం, శ్రీధరరావు దంపతుల్ని అభినందించాలి.

Click Here to go to Nartanashala (1963) Movie Page.

పన్నేండేళ్ళు అరణ్యవాసం పూర్తయిన పిదప పాండవులు ఒక యేడు అజ్ఞాతవాసం చెయ్యాలి. అంటే ఆ సంవత్సరంపాటు వారిని యెవరూ గుర్తు పట్టలేనంతగా బ్రతకాలి. ఆ ప్రకారం ధర్మరాజు కంకు భట్టుగా, భీముడు వంటవాడు వలలునిగా, అర్జునుడు నాట్యాచార్యులు బృహన్నలగా, నకల, సహదేవులు గోపాలురుగా ద్రౌపది సైరంధ్రిగా విరాటరాజు కొలువులో ఆశ్రయం పొందుతారు.

విరటుని భార్య సుధేష్ఠా, ఆమెకు పరిచారక సైరంధ్రి. సుధేష్ఠ సోదరుడు సింహబల బిరుదాంకితుడైన కీచకుడు. అతడు సైరంధ్రిని చూసి మోహిస్తాడు. విరాటరాజు కుమార్తె ఉత్తరకు నాట్యం నేర్పుతాడు బృహన్నల ఆ ఉత్తరను ప్రేమిస్తాడు అభిమన్యుడు.

కీచకుని దురాగతానికి విలపిస్తుంది సైరంధ్రి. బృహన్నల సూచనమేరకు సైరంధ్రి కీచకుని వలచినట్టు నటించి నర్తనశాల కు ఆహ్వానిస్తుంది. అక్కడ వలలుడు కీచకుని సంహరిస్తాడు.

ఈ విషయాన్ని తెలుసుకొన్న దుర్యోధనాదులు పాండవుల వునికిని సందేహించి విరాటరాజుపై దాడి చేసి ఉత్తర గోగ్రహణం నిర్వహిస్తారు. బృహన్నల ఉత్తరకుమారునికి సారధిగా నిలిచి విరాటరాజు తరపున సైన్యాన్ని నడిపిస్తాడు. కౌరవులు పరాజితులై పలాయనంచిత్తగిస్తారు. ఉత్తరాభిమన్యుల కళ్యాణంతో కథ పరిసమాప్తమౌతుంది.

ఇందులో శాపవశాత్తూ బృహన్నలగా మారిన అర్జునుడిగా యన్.టి.ఆర్, ద్రౌపదిగా సావిత్రి, కీచకునిగా యస్.వి.రంగారావు ఆ పాత్రల్లో జీవించారు. ఇతర భూమికల్లో రేలంగి, యల్.విజయలక్ష్మి హరనాధ్, సంధ్య, దండమూడి రాజగోపాల్, కాంతారావు, సత్యనారాయణ, ముక్కామల, మిక్కిలినేని నటించారు. అతిధి నటులుగా శ్రీకృష్ణుని పాత్రలో కాంతారావు, చాలాకాలం తరువాత కాంచనమాల, నిర్మాత లక్ష్మిరాజ్యం, సూర్యకాంతం నటించారు.

కీచకుని పాత్రకు సముద్రాల వ్రాసిన సంభాషణలు వాటికి ప్రాణం పోసిన యస్.వి.రంగారావు అభినయం చిత్రానికి వన్నె తెచ్చాయి.

సుసర్ల దక్షిణామూర్తి స్వరపరచిన సముద్రాల గీతాలు “సఖియా వివరించవే బాలమురళీకృష్ణ పాడిన “సలలితరాగసుధారససారం, దరికిరాబోకు రాబోకు రాజా శ్రీశ్రీ వ్రాసిన యుగళగీతం ‘ఎవ్వరికోసం యీ మందహాసం, జానకి ఆలపించిన నరవరా ఓ కురువరా” గీతాలు ప్రాచుర్యం పొందాయి. భారతంలోని “ఏనుంగు నెక్కి, కాంచనమయ వేదికా” పద్యాలు ఘంటసాల గళంలో జీవం పోసుకున్నాయి.

జకార్తాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ‘నర్తనశాల’ పాల్గొనగా యస్.వి.రంగారావు ఉత్తమనటుడిగా, టి.వి.యస్. శర్మ ఉత్తమ కళాదర్శకునిగా అవార్డులందుకోవటం తెలుగు సినీ జగతికే గర్వకారణం.

Nartanasala was released on 11 October 1963 in 26 centres. Navayuga Films acquired the film’s distribution rights. Katragadda Narsaiah of Navayuga worked on the film’s posters and publicity. The film was commercially successful, managing to have a theatrical run of 100 days in 19 centres and 200 days in Hyderabad and Vijayawada. According to The Hindu, Nartanasala’s complete theatrical run lasted for 25 weeks. The film’s Bengali and Odia dubbed versions were commercially successful on par with the original. Nartanasala was adjudged the second best feature film at the 11th National Film Awards. It won the Filmfare Award for Best Film – Telugu. At the 3rd Afro-Asian Film Festival held at Jakarta in 1964, Nartanasala received two awards: best male actor (Ranga Rao) and best art director (Sarma).

In its 87th volume released in 1966, the now-defunct magazine The Illustrated Weekly of India noted Kanchanamala’s cameo appearance, stating, “her delivery was as flawless as in bygone days and the years had not robbed her of charm”. Reviewing Nartanasala, the University of Iowa stated that the film “unfolds in near-operatic style reminiscent of many genres of Indian folk theatre”. Rama Rao’s performance as Brihannala was praised: “Rao manages the transition well, swishing about in glittery drag and affecting exaggeratedly feminine mannerisms”. The reviewer also found Kanta Rao’s portrayal of Krishna “suitably charming, with an enigmatic style”. M. L. Narasimham of The Hindu noted that the film provided one of the most fulfilling performances for Savitri as Sairandhri. On its 45th anniversary, Telugu newspaper Sakshi praised the performances of Rama Rao and Ranga Rao as Brihannala and Keechaka respectively; the newspaper termed the former a “strange adventure” considering the actor’s stardom.

Source: 101 C, S V Ramarao, Wiki

Spread the love:

Comments