May 6, 2020

Mangalya Balam (1959): National Award Winning Best Feature #TeluguCinemaHistory

Mangalya Balam (1959): National Award Winning Best Feature #TeluguCinemaHistory

ఆశాపూర్ణాదేవి నవల ‘అగ్నిపరీక్ష’ను అదే పేరుతో బెంగాలీలో 1954లో చిత్రంగా తీయగా అది హిట్టయ్యింది. దానిని తెలుగులో తీయాలని కొందరు నిర్మాతలు ప్రయత్నించి యాంటీ సెంటిమెంట్ అన్న భావంతో వెనక్కి తగ్గారు. అయితే దానిపట్ల అచంచల విశ్వాసం వున్న నిర్మాత, అన్నపూర్ణా పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు దాన్ని చిత్రంగా తియ్యాలని నిర్ణయించుకుని ఆ బాధ్యతను దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు అప్పచెప్పారు. పనిలో పనిగా దానిని తమిళంలో కూడా తీయాలనుకున్నారు.

Click Here to go to Mangalya Balam (1959) Movie Page.

రావు సాహెబ్ పాపారావు (యస్.వి.రంగారావు) సోదరి జి.వరలక్ష్మి. వీరిద్దరికీ తల్లికన్నాంబ. పాపారావు కూతురు సరోజ. వరలక్ష్మి కొడుకు చంద్రశేఖర్. కారణాంతరాలవల్ల ఆ రెండు కుటుంబాలు దూరంగా వుంటాయి. ఒకానొక సందర్భంలో అంతిమదశలో వున్న కూతురి మనశ్శాంతి కోసం తల్లి కన్నాంబ పిల్లలైన సరోజకు చంద్రానికి వివాహం జరిపిస్తుంది. పాపారావు భార్య సూర్యకాంతం, యీ పెళ్ళికి ఆగ్రహించి పాప మెడలోని మంగళసూత్రాన్ని తెంచేస్తుంది. పదిహేనేళ్ళు గడుస్తాయి.

 సరోజ (సావిత్రి), చంద్రశేఖర్ (నాగేశ్వరరావు) పెరిగి పెద్దవారవుతారు. సరోజకు చిన్నప్పుడు జరిగిన వివాహం గుర్తుండదు. హీరోకు గుర్తుంటుంది. శేఖర్గా ఆ కుటుంబానికి దగ్గరవుతాడు. పాపారావు సరోజకు కైలాసం (రేలంగి)కి ఇచ్చి పెళ్ళి చేయాలను కుంటాడు. ఆ కైలాసం శేఖర్ స్నేహితుడు. బలవంతపు పెళ్ళినుంచి తప్పించుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మీనాక్షని రక్షించి ఆమెను ప్రేమిస్తాడు కైలాసం.

సరోజ, శేఖర్ల స్నేహం ప్రేమగా మారి పతాకస్థాయికి చేరేసరికి సరోజ సోదరడు డాక్టర్ అయిన రమణమూర్తి సరోజకు చిన్నప్పుడే వివాహం అయ్యిందన్న విషయాన్ని వివరిస్తాడు. దాంతో సరోజలో సంఘర్షణ ప్రారంభమై శేఖర్కు దూరమవాలని నిర్ణయించుకుంటుంది. అయితే శేఖర్ను చూసిన నాయనమ్మ అతన్ని గుర్తించి సరోజకు చంద్రం బావ అని, వారిద్దరికీ చిన్నప్పుడే పెళ్ళి జరిగిన నిజాన్ని వివరిస్తుంది.

శేఖర్ ని అంతమొందించాలని పాపారావు బయల్దేరతాడు. సరోజ అడ్డుపడుతుంది. కన్నాంబ ద్వారా నిజం తెల్సుకున్న పాపారావు దంపతులు మనసు మార్చుకొని నాయికానాయకుల్ని ఆశీర్వదిస్తారు.

ఈ కథలో బరువైన సన్నివేశాలతో బాటూ హాస్యానికి కూడా పెద్దపీట వేశారు. కైలాసం మీనాక్షిల ప్రేమకథ, సరోజ-శేఖర్ల మధ్య ప్రేమ చిగురించడానికి మిత్రబృందం ఆడిన నాటకం ఇవన్నీ హాస్యాన్ని పండించాయి.

ప్రణయ సన్నివేశాల్లోనూ, విషాద సన్నివేశాల్లోనూ అక్కినేని-సావిత్రి పోటీపడి నటించారు. తొలిసారిగా ఈ చిత్రాల్లోని పలు సన్నివేశాల్ని ఊటీలో చిత్రీకరించారు. రేలంగి, రాజసులోచన గిలిగింతలు పెట్టే హాస్యం అందించారు. కన్నాంబ, జి.వరలక్ష్మి, యస్.వి.రంగారావు, సూర్యకాంతం గంభీరమయిన పాత్రలకు ప్రాణం పోశారు. ఇతర సహాయపాత్రల్లో రమణారెడ్డి, చదలవాడ కుటుంబరావు, సీతారాం, డాక్టర్ శివరామకృష్ణయ్య, పేకేటి శివరామ్, రమణ మూర్తి, అనూరాధ నటించారు.

ఆత్రేయ రచన చేసిన ఈ చిత్రానికి శ్రీశ్రీ, కొసరాజు పాటలు రాశారు. మాస్టర్ వేణు అందించిన సంగీతం ఎంతగానో ప్రజాదరణ పొందింది. చిన్నపిల్లల పై చిత్రీకరించిన హాయిగా ఆలూమగలై కాలం గడపాలి’, హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన యుగళగీతాలు ఆకాశవీధిలో అందాల జాబిలి’, “పెనుచీకటాయె లోకం’, ‘వాడిన పూలే వికసించెనే’ రాగిణి, రాజసులోచన పై చిత్రీకరించిన నృత్యగీతం ‘ఔనంటారా, కాదంటారా’, రేలంగి రాజసులోచనల పై చిత్రీకరించిన హాస్యగీతాలు ‘చెక్కిలిమీద చెయ్యివేసి చిన్నదానా’, మైడియర్ మీనా మహా మంచిదానా’.. ఈ పాటలన్నీ హిట్ అయ్యాయి.

అన్నపూర్ణావారు ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు.తెలుగులో రేలంగి పోషించిన పాత్రను తమిళంలో తంగవేలు ధరించారు.

7.1.1959న తెలుగు చిత్రం ‘మాంగల్యబలం’, 14.1.1959న తమిళ చిత్రం ‘మంజల్ మహిమై’ విడుదలై ఘనవిజయం సాధించగా తెలుగుచిత్రం ‘మాంగల్యబలం’కు రాష్ట్రపతి యోగ్యతాపత్రం లభించింది.

Mangalyabalam was said to be the first Telugu film to shoot in Ooty and it was also Savitri’s first visit to the hill town. Mangalyabalam was released on January 7, 1959 and for the first time in the history of Telugu cinema, the hundred days function was held in an open arena, the Municipal High School grounds, Vijayawada with thousands of cine fans participating and presided over by the then Chief Minister of Andhra Pradesh, Kasu Brahmananda Reddy. Mangalyabalam celebrated a silver jubilee run as well and also won the certificate of Merit at the 6th National film awards.

Source: 101 C, S V Ramarao, The Hindu

Spread the love:

Comments