January 14, 2020

Mala Pilla (1938): The First Revolutionary Social Film #TeluguCinemaHistory

Mala Pilla (1938): The First Revolutionary Social Film #TeluguCinemaHistory

The 1930s in India was an era of rebels and revolutions. Telugu cinema was full of mythological set-ups and storylines borrowed from stage plays.

Gudavalli Ramabrahmam was a revolutionary of sorts. He directed a social drama taking Chalam’s story ‘Mala Pilla’ as the base, a love story between a Brahmin and a Harijan.

Ramabrahmam ran a stationary shop, was a theatre critique for ‘Swarajya’ magazine and ran a theatre group ‘Bharata Muni Brindam’.

After that he worked for Samadarsani paper and entered movies by helping with the publicity of Vel Pictures. He had the lofty ambition of changing the society through movies, and not merely viewed for entertainment.

Gudavalli Ramabrahmam

‘Mala Pilla’ was the first venture of ‘Sarathi Films’ that he and a few others started. It was a risky venture and sure enough, created quite a stir when it was released.

The story goes thus: While some try to end discrimination against Harijans in a village, the Brahmins oppose it headed by priest Sunderama Shastri. His photographer son Nagaraju falls in love with Shamapalatha, a Harijan girl and elopes with her to Calcutta where he teaches her to read and write. The two sects fight over water and work. After Shastri’s wife is saved by the Harijans from a fire accident, his view of them changes. With the police and a few civilians, the situation in the village calms down while Nagaraju and Shampalatha are married with Shastri’s blessings.

Some people tried to stop the screening; in retaliation Bramham gave free passes to Brahmins who wanted to watch it. While some became converts, there were others who went home and bathed to get rid of the sin of watching such a movie.

పిలకలున్న బ్రాహ్మణులకు ఈ సినిమా ఫ్రీగా చూపిస్తామని ప్రచారం చేయటం, సినిమా చూసిన చాందస బ్రాహ్మణులు కొందరు ఇళ్లకు వెళ్లి ప్రాయిశ్చితంగా స్నానాలు చేయటం అప్పుడు జరిగిన విశేషాల్లో చెప్పుకోదగ్గవి. అప్పటిదాకా గ్రాంధికభాషలో సాగిన సినిమా రచన ఈ చిత్రంతో వ్యావహారిక భాషతో కొనసాగటం కొత్తమలుపుకు దారి తీసింది.

అప్పట్లో తిరువాన్కురు  మహారాజావారు విశాల దృక్పథంతో హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించారు.’మంచియన్నది మాలయైతే మాల నేనవుతాను’ అని కవితాపరంగా గురజాడ అప్పారావు ఎలుగెత్తి చాటారు. సామాజిక చైతన్యాన్ని ఆశించిన ‘మాలపిల్ల’ చిత్రాన్ని దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారికి అంకితమిచ్చారు.

Mala Pilla(1938) – Poster Design

This set several trends and records. First of all, the Bookish Telugu used generally was traded for colloquial slang in Mala Pilla. Social dramas became big after this movie. Issues such as civil rights, cruelty to animals and alcohol prohibition are addressed in the movie. The songs borrowed heavily from Janapadam; Bheemavarapu Narsimha Rao and Basavaraju with music and lyrics gave a popular set of songs.

Govindarajula Subbarao debuted with this as the haughty and irrational Brahmin. Generally the projection of this caste was that of Rishis or Gurus, but this character was conflicting and contradictory to the given trend.

Kanchanamala, the popular and glamorous star back then, had a totally deglam look in the first half. The second half has a still of her with a ‘modern’ outfit in Calcutta which found its way into all Telugu homes’ calendars. Still photographer Satyam started out with this movie, where he was an office boy and filled in for an absentee photographer.

మాలపిల్ల సినిమా బడ్జెట్ పూర్తయ్యేసరికి రూ.లక్షా పదివేలు. అప్పట్లో తెలుగు సినిమాలు లక్ష రూపాయల లోపు బడ్జెట్ తో నిర్మించేవారు. ఆ ప్రమాణాల్లో మాలపిల్ల భారీ బడ్జెట్ సినిమాగా చెప్పాలి.

Bramham also made Raithu Bidda, Apavadhu, Illalu, Patni among others. Mala Pilla remained one of his best ventures and more than anything, an original of sorts which set many trends.

During the filming of Palnati Yuddham, he succumbed to cancer. Mala Pilla came as a breath of fresh air in an era ridden with Myth and superstition and was a brave attempt by a revolutionary filmmaker.

Click here to go to Mala Pilla (1938) movie page.

The Reception:

మాలపిల్ల సినిమా మంచి విజయం సాధించింది. సినిమాపై రేకెత్తిన వివాదాలు మాలపిల్ల సినిమాను ప్రచారంలోకి తీసుకురావడానికి ఉపకరించి విజయానికి దోహదం చేశాయి. వసూళ్ళపరంగానూ, విడుదలైన థియేటర్ల పరంగానూ కూడా మాలపిల్ల అప్పటి సినిమా రంగంలో కొత్త రికార్డులు నెలకొల్పింది. సినిమా విడుదల సమయంలో వచ్చిన సమీక్షలు సినిమాకు సానుకూలంగా రాలేదు. ఆంధ్రపత్రికలో సినిమా విడుదలకు ముందే ప్రచురితమైన సమీక్షలో “కళ్యాణపురంలో బ్రాహ్మణులకు, హరిజనులకు తప్ప మిగతా కులాల వారందరికీ ఈ సమస్య (ఛాందసం, మౌఢ్యం) సంబంధం లేకుండా ఎందుకు చేశారో బోధపడకుండా ఉంది. నాగరాజు, శంపాలతల మధ్య చూపించింది ప్రేమగా కాక కామంగా అగుపిస్తుంది. ఉదాత్తమైన ప్రేమానుబంధం లేకపోవడం వల్ల ఈ పాత్రలు సానుభూతికి నోచుకోకుండా పోయాయి” అని విమర్శించారు. అయితే సమకాలీన విమర్శకుల స్పందన మిశ్రమంగానూ, కొంత వ్యతిరేకంగానూ ఉన్నా కాలానుగుణంగా సినిమాను విమర్శకులు క్లాసిక్ గా గుర్తించారు. సాంఘిక సమస్యలపై సాహసోపేతంగా తీసిన సినిమాగా తెలుగు సినిమా రంగంలో ప్రత్యేక స్థానం ఇచ్చారు.

మాలపిల్ల సినిమా అత్యంత వివాదాస్పదమైన, వాదవివాదాలకు కారణమైన సినిమా. కుల మౌఢ్యం అన్ని కులాల వారిలోనూ ఉండగా కేవలం బ్రాహ్మణులనే కేంద్రం చేసుకుని తీశారని, సినిమాలో చౌదరి పాత్ర ద్వారా కమ్మవారు మాత్రమే సంస్కరణాభిలాషులు అన్నట్టు చూపిస్తున్నారన్న విమర్శతో బ్రాహ్మణులు వ్యతిరేకించారు. విజయవాడ బ్రాహ్మణ సంఘం నియమించగా పండ్రంగి కేశవరావు అనే ప్రముఖుడు సినిమాను సమీక్షించి సినిమాకు అననుకూలమైన నివేదిక సంఘానికి సమర్పించాడు. బ్రాహ్మణులకు, హరిజనులకు మధ్య వైషమ్యాలు రేకెత్తించేందుకు, బ్రాహ్మణుల పట్ల ద్వేషం రగిలించేందుకు సినిమా తీశారంటూ అభ్యంతరకరమైన సన్నివేశాలను, సంభాషణలను తొలగించి పునర్నిర్మించేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాకినాడ ఈశ్వర పుస్తక భాండాగారం వారు సినిమాను నిషేధించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. సినిమా ప్రభావంతో కొన్ని పట్టణాల్లో పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించారు. దాంతో పట్టణాల మున్సిపాలిటీలు సినిమా నిషేధించాలని ప్రయత్నాలు చేశాయి. అయితే వీటివల్ల సినిమా నిషేధం కానీ, ప్రదర్శనలకు ఆటంకం కానీ కాలేదు.

Mala Pilla (1938) – Poster Design

బ్రాహ్మణులకు సినిమాపై ఉన్న ఆగ్రహాన్ని పెంచుతూ సినిమా బృందం “పిలక బ్రాహ్మణులకు ఫ్రీ పాసులు” అంటూ కరపత్రాలు ప్రచురించారు. బి.నరసింహారావు అనే వ్యక్తి సినిమాను సమర్థిస్తూ రాశాడు. కొన్ని గ్రామాల్లో బ్రాహ్మణులు మంచినీటి చెరువుకు వెళ్ళి నీరు తెచ్చుకోనియ్యకపోవడంతో కలకలం రేగింది. జరిగిన వాదోపవాదాలు, వివాదాలు అన్నీ చివరకు చిత్రంపై ఆసక్తి పెంచేందుకే పనికి వచ్చి ఘన విజయం సాధించింది.

మాలపిల్ల సినిమాలో హరిజనోద్ధరణ, హరిజనుల దేవాయల ప్రవేశం, అంటరానితనం నిర్మూలన వంటివి ప్రధానమైన థీమ్స్. సినిమాకు ఆధారమైన చలం నవల మాలపిల్లలో బ్రాహ్మణ యువకుడు, హరిజన బాలిక ప్రేమ, సమాజంలో వారికి ఎదురైన సమస్యలు మాత్రమే ఇతివృత్తం కాగా దర్శక, రచయితలు దీనికి హరిజనుల దేవాలయ ప్రవేశం, అంటరానితన నిర్మూలన, గాంధేయవాదం వంటి అంశాలపై కథాంశాన్ని విస్తరించారు. సినిమా చివరిలో హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించిన తిరువాన్కూరు మహారాజు చర్యను ప్రశంసిస్తూ సంభాషణలు రాయించారు. మాలపిల్ల సినిమాను ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రపత్రిక వ్యవస్థాపకుడు, సంస్కరణాభిలాషి అయిన కాశీనాథుని నాగేశ్వరరావుకు అంకితం ఇచ్చారు. సినిమా చిత్రీకరణ ప్రారంభించే సమయానికి ఆయన మరణించారు, ఆయన అంతిమయాత్రను చిత్రీకరించి సినిమాతో పాటుగా అనుబంధంగా విడుదల చేశారు.

1930ల్లో సంగీత భరితమైన సినిమాల పద్ధతిని అనుసరించి మాలపిల్ల సినిమాలో 17 పాటలు, 12 వరకూ పద్యాలు ఉంటాయి. సాంఘిక సమస్యలపై, ప్రణయ ఇతివృత్తంపై ప్రముఖ భావకవి బసవరాజు అప్పారావు అంతకుముందే రాయగా, ప్రజాదరణ పొందిన పలు గీతాలను సినిమా కోసం తీసుకున్నారు. “కొల్లాయి గట్టితేనేమి”, “నల్లవాడేనే గొల్లవాడేనే”, “ఆ మబ్బు ఈ మబ్బు” వంటివి ఆ పాటల్లో ఉన్నాయి. ఒక సందర్భానికి జయదేవుని అష్టపదుల నుంచి “సావిరహే తవ దీనా రాధా” గీతాన్ని తీసుకున్నారు. మిగిలిన సందర్భాలకు తాపీ ధర్మారావు నాయుడు రాశారు. ఈ సినిమాకి భీమవరపు నరసింహారావు సంగీత దర్శకత్వం వహించారు. ఛాయాగ్రాహకునిగా శైలేన్ బోస్ పనిచేశారు. నాట్యాలను చమన్ లాల్ నిర్వహించగా, కూర్పు ధరంవీర్ సింగ్ చేశారు. ఎస్.వి.ఎస్.రామారావును కళాదర్శకునిగా, పి.వి.విశ్వనాథ శర్మను శబ్ద గ్రాహకునిగా తీసుకున్నారు.

ఈ సినిమా విజయదశమి సందర్భంగా 1938 సెప్టెంబరు 25న విడుదల అయింది. ఆంధ్ర ప్రాంతంలో 11 కేంద్రాలు, బెంగళూరు నగరంలోనూ సినిమా విడుదల అయింది.

Source: APK-CG, Wiki, News Papers, 101 C – S V Ramarao

Spread the love:

Comments