May 17, 2020

Mahamantri Timmarusu (1962): Telugu Cinema Reminiscence #TeluguCinemaHistory

Mahamantri Timmarusu (1962): Telugu Cinema Reminiscence #TeluguCinemaHistory

తెలుగు భాషా సౌందర్యాన్ని తన సుందర కవితా మధురిమలతో యెలుగెత్తిచాటిన రాజ కవి శ్రీకృష్ణదేవరాయలు. ఆ రాయలును చిన్ననాటి నుంచి కంటికి రెప్పలా కాపాడి విజయనగర సామ్రాజ్య సార్వభౌముని చేసినవాడు మహామంత్రి తిమ్మరుసు.

Click Here to go to Mahamantri Timmarusu (1962) Movie Page.

వారిద్దరి అనుబంధాన్ని ఆత్యీయతను, మహామంత్రి తిమ్మరుసు రాజకీయ చతురతను, అందుకు ప్రతిగా రాయలు తిమ్మరుసును అనుమానించి శిక్షించి పిదప పశ్చాత్తాపంతో రగిలిపోయిన రాయల ఆంతర్యాన్ని తెరపై ఆద్భుతంగా హృదయాలను హత్తుకునే రీతిలో రూపాందించిన చారిత్రక చిత్రం “మహామంత్రి తిమ్మరుసు”.

ఈ చిత్ర రూపకల్పనలో ప్రధాన పాత్రధారులు రచయిత పింగళి నాగేంద్రరావు, దర్శకులు కమలకర కామేశ్వరరావు, నిర్మాత పుండరీకాక్షయ్య. ఈ ముగ్గురూ చిరస్మరణీయులే!

శ్రీకృష్ణదేవరాయలు మారు వేషంలో నర్తకి చిన్నాదేవి నాట్యకౌశాలాన్ని చూసి ముగ్గుడై వివాహం చేసుకుంటాడు. అంతకు ముందే మంత్రి తిమ్మరుసు నిర్ణయించడం వల్ల శ్రీరంగపట్టణాధీసుని కుమార్తె తిరుమలదేవిని కూడా చేసుకుని విజయనగర సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడౌతాడు.

కటకాన్ని పాలిస్తున్న ప్రతాపరుద్ర గజపతి అహంకారాన్ని అణచివేసేందుకు గజపతిపై దండయాత్ర చేస్తాడు. గజపతి కూతురు పురుషవేషంలో వచ్చి రాయలు ఔదార్యాన్ని చూసి ప్రేమిస్తుంది. తన కుమార్తె ద్వారా తన విరోధియైన రాయలును సాధించాలనే పన్నాగంతో గజపతి రాయలుతో తన కూతురు అన్నపూర్ణ వివాహానికి అంగీకరించి పెళ్ళి చేసి శోభనం నాటి రాత్రి రాయలును అంతమొందించమని కుమార్తెకు సూచిస్తాడు.

తిమ్మరుసు యుక్తివల్ల ఆ గండం తప్పిపోతుంది. అయితే అన్నపూర్ణకు బంధువైన హంవీరుడు ఆమె శ్రేయస్సు కోరుతున్నట్లు నటించి రాయల మనసును కూడా మళ్ళించి వారికి పుట్టిన బాలరాయలకు విష ప్రయోగం చేసి దానిని మహామంత్రి తిమ్మరుసు మీదకు మళ్ళీస్తాడు. దానిని నమ్మిన రాయలు తిమ్మరుసు కళ్ళు పెరికించవలసినదిగా ఆదేశిస్తాడు. శిక్ష అమలు జరిగాక రాయలు నిజం తెలుసుకుని కుమిలిపోతాడు.

ఈ కథను తెరకు తగ్గట్టుగా అధ్బుతంగా మలిచారు రచయిత పింగళి,దర్శకులు కమాలకర కామేశ్వరరావు. కథానాయికలుగా దేవిక, ఎస్. వరలక్ష్మీ, ఎల్. విజయలక్ష్మీ నటించగా సహాయపాత్రలను రేలంగి, రాజశ్రీ దుష్టపాత్రను లింగమూర్తి పోషించారు.

రాయలుగా యన్.టి.ఆర్., టైటిల్ పాత్రను గుమ్మడి వెంకటేశ్వరరావు ఎంతో నిగ్రహంతో నటించారు. యస్.వి. రంగారావు లాంటి మహానటుడు వుండగా నాకు తిమ్మరుసు పాత్ర లభించడం, యన్.టి.ఆర్. వుండగా టైటిల్ నా పాత్ర మీద వుండటం నా అదృష్టం అంటారు గుమ్మడి.

చెరసాల దృశ్యంలో శిక్ష అమలు జరుగక ముందు రాయలును తిమ్మరుసు ఆపాదమస్తకం తనివి తీరా చూసే దృశ్యాన్ని నిర్మాత పుండరీకాక్షయ్య సూచన మేరకు రీషూట్ చేసతారు. నిజానికి ఆఒక్క సన్నివేశం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

పెండ్యాల స్వరపరచిన “మోహనరాగమహా, లీలా కృష్ణ నీ లీలలు తిరుమల తిరుపతి వెంకటేశ్వరా” గీతాలు నేటికీ ఎంతగానో అలరిస్తున్నాయి. నాటి చారిత్రిక వాతావరణానికి తగ్గట్టుగా సెట్స్ వేశారు కళా దర్శకులు గోఖలే.

గౌతమీ పతాకంపై యన్. రామబ్రహ్మం, ఎ. పుండరీకాక్షయ్య సంయుక్తంగా నిర్మించిన యీ చిత్రానికి రాష్ట్రపతి రజత కమల పురస్కారం లభించింది.

Released on July 26, 1962 Mahamantri Timmarusu celebrated a hundred day run in five centres and it received the President’s silver medal as the best regional film at the national film awards.

Source: 101 C, S V Ramarao, The Hindu

Spread the love:

Comments