May 7, 2020

Mahakavi Kalidasu (1960): Pride of Telugu Cinema #TeluguCinemaHistory

Mahakavi Kalidasu (1960): Pride of Telugu Cinema #TeluguCinemaHistory

పౌరాణిక చారిత్రాత్మక చిత్రాలను సాధికారంగా తీయగలదిట్ట కమలాకర కామేశ్వరరావు, రచయిత పింగళి నాగేంద్రరావులు ఆపూర్వ కాంబినేషన్లో రూపుదిద్దుకొన్న చారిత్రాత్మక చిత్రం సారణీ పతాకంపై ఎస్.నాగమణి (శ్రీరంజని భర్త), నటుడు పీ.సూరిబాబు సంయుక్తంగా నిర్మించిన “మహాకవి కాళిదాసు”.

Click Here to go to Mahakavi Kalidasu (1960) Movie Page.

అవంతీ రాకుమారి విద్యాధరి. ఒక గ్రామంలో కాళుడు ప్రత్యక్ష రామాయణం హరికథ చెబుతాడు. మూర్ఖుడుగా కనిపించే కాళుడు అందగాడు. అతడికి పండిత వేషం కట్టి కుతంత్రంతో రాజకుమారితో పెళ్ళి జరిపిస్తాడు దుష్టుడయిన మంత్రి.

వివాహానంతరం తన భర్త యొక్క నిజరూపం తెలుసుకొన్న విద్యాధరి హతాశయురాలై కరుణించమని దేవిని ప్రార్ధిస్తుంది. కాళుడు కూడా దేవిని ప్రార్ధించి ఆదేవి కృపవల్ల మహాకవిగా రూపొంది “మాణిక్య వీణాం” శ్లోకంతో దేవిని తృప్తి పరచి భార్యను మరచి అవంతీరాజ్యాన్ని విడిచి పూర్వజ్ఞాపకాలని కోల్పోయి పండితుడై ఎక్కడికో వెళ్ళిపోతాడు.

ఆలా వెళ్ళిన కాళిదాసు కాశిలో పండుతుల సమక్షంలో తన ప్రజ్ఞను ప్రదర్శించి చివరకు భోజరాజు ఆస్థానం చేరుకొంటాడు. బ్రహ్మరాక్షసి భోజ-కాళిదాసులను బ్రహ్మ సరస్వతీ అవతార మని తెలుపుతుంది. భోజరాజు కొలువులో నర్తకి విలాసవతి కాళిదాసుపై ఆశపడుతుంది.మారువేషంలో కాళిదాసు నివాసానికి వచ్చి, భర్త తననుగుర్తించక పోయేసరికి బాధతో అక్కడే వుండి ఉమ పేరుతో భర్తకు పరిచార్యలు చేస్తూ సహకరిస్తుంది.

ఆమె భర్తకు దూరమయ్యిందని తెలుసుకొన్న కాళిదాసు ‘అభిజ్ఞాన శకుంతల’ గ్రంథరచనకు వుపక్రమిస్తాడు. శాపంచేత భార్యను భర్త మరచిపోవచ్చు గదా అని ఉమ సూచించటంతో దుష్కంతుడు ఉంగర ప్రభావం చేత శకుంతలను మరచినాడని కీలకమయిన మలుపుతో గ్రంథరచన చేస్తాడు కాళిదాసు.

అవంతీరాజు అల్లుడి సంగతి విని భోజరాజు ఆస్థానానికి రాగా అక్కడ మామా అల్లుళ్లకు సంవాదం జరిగి “శకుంతల” కథ వలె తాను భార్య మరచిపోయిన సంగతిని గుర్తిస్తాడు కాళిదాసు. కాళిదాసు వ్రాసిన రఘువంశం, మేఘసందేశం, శకుంతల యేయే పరిస్థితిలో వ్రాశాడో సవివరంగా తెలపటం చెప్పుకోదగ్గ విశేషం.

కాళుడికి పింగళి వ్రాసిన ‘వెలుగువెలగరా నాయినా’, రామాయణం కథ, శోభనం గదిలోని పాట ‘నీకెట్టుందో గాని పిల్ల’ గీతాలు పాత్రోచితంగా వున్నాయి. శకుంతల అంతర్నాటకం రసవత్తరంగా వుంది. పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చిన సంగీతం చిత్రానికి నిండుదనాన్ని,గంభీరతను చేకూర్చింది.

కాళుడుగా, కాళిదాసుగా ఆ రెండు పాత్రల్లోని వైవిధ్యాన్ని నటనాపరంగా అద్భుతంగా ఆవిష్కరించారు అక్కినేని నాగేశ్వరరావు. భోజరాజాగా యన్.వి. రంగారావు,కథానాయిక విధ్యాధరిగా జానియర్ శ్రీరంజని, విలాసవతిగా రాజసులోచన, ఇతర ముఖ్యపాత్రల్లో రేలంగి, సి.యస్.ఆర్, లింగమూర్తి, సూరిబాబు, కె.వి.యస్.శర్మ నటించారు.

కథాకాలం నాటి చారిత్రిక వాతావరణానికి తగ్గట్టు సెట్స్ను పాత్రలకు రూపకల్పన చేసారు ఆర్ట్ డైరెక్టర్ గోఖలే.

నిజానికి ఆక్కినేని నటజీవితంలో చెప్పుకోదగిన పాత్ర ‘మహాకవి కాళిదాసు’. ఈ చిత్రానికి కేంద్రప్రభుత్వ ‘రజిత కమలం’ పురస్కారం లభించింది.

ఈ చిత్రానికి సంబంధించి హైలైట్గా చెప్పుకోదగ్గ ఆంశమేమిటంటే 1996వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అక్కినేని నాగేశ్వరరావుగారిని ప్రతిష్ఠాత్మక “కాళిదాసు కౌస్తుభ” పురస్కారంతో సత్కరించటం.

Released on April 2, 1960, the Telugu version opened with mixed response at the box office but was hailed as a cult classic and won the silver medal in the regional film category at the National awards.

Source: 101 C, S V Ramarao

Spread the love:

Comments