May 22, 2020

Lava Kusa (1963): The Most Loved Classic and Massive Blockbuster #TeluguCinemaHistory

Lava Kusa (1963): The Most Loved Classic and Massive Blockbuster #TeluguCinemaHistory

నిర్మాత శంకర రెడ్డి “చరణదాసి” (1956) చిత్రం తరువాత మొదలుపెట్టి దాదాపు ఏడు సంవత్సరాలు చిత్ర నిర్మాణం సాగించి 1963లో విడుదలచేసిన చిత్రం “లవకుశ”. ముఖ్యంగా ఘంటసాల సంగీత సారధ్యంలో రూపుదిద్దుకొన్న పాటలు యీ చిత్రానికి ప్రాణం పోసాయి.

Click Here to go to Lava Kusa (1963) Movie Page.

1934లో వచ్చిన ‘లవకుశ’కు దర్శకత్వం నెరపిన ‘తారాబ్రహ్మ’ సి.పుల్లయ్య యీచిత్రానికి దర్శకత్వం వహించటం విశేషం. అయితే ఆయనకు సహకరించారు వారి కుమారులు సి.యస్.రావు.

సీతారాముల పట్టాభిషేకానంతరము ఒక సామాన్య రజకుడు రావణుని చెరలోవున్న సీతాదేవి శీలాన్ని శంకించే విధంగా నిందారోపణ చేస్తాడు. “ప్రజా వాక్యంతు కర్తవ్యం” అన్న భావనతో శ్రీరామచంద్రుడు గర్భవతియైన సీతాదేవిని అరణ్యంలో దింపిరమ్మని లక్ష్మణనకు ఆదేశిస్తాడు. దాన్ని అమలు చేస్తాడు లక్ష్మణుడు.

అరణ్యంలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో రక్షపొందుతుంది. సీతాదేవి (లోకపావని అనేపేరుతో).

అక్కడ సీతాదేవి కుశలవులకు జన్మనిస్తుంది. వారు వాల్మీకి వద్ద శ్రీరామ కథను దానిని అయోధ్యనగర వీధులలో గానం చేసి శ్రీరామచంద్రుని అభిమానాన్ని చూరగొంటారు.

ప్రజాక్షేమం కోసం శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగాన్ని నిర్వహించగా, లవకుశలు యాగాశ్వాన్ని బంధించి శ్రీరామచంద్రునితో పోరుకు తలపడతారు .శ్రీరామచంద్రుడు లవకుశలను తన కుమారులని గ్రహించి ఆనందిస్తాడు. సీతాదేవి తల్లి భూమాతలో ఐక్యమౌతుంది.

రసవత్తరమైన యీ కథకు సదాశివబ్రహ్మాం మాటలు, కొన్ని పాటలు వ్రాసారు ఆయనతో బాటు సముద్రాల సినియర్, కొసరాజు పాటలు వ్రాసారు. సాధారణంగా హాస్యగీతాలను వ్రాసే కొసరాజు “ఏ నిముషానికి ఏమి జరుగునో” వంటి గీతం వ్రాయటం విశేషం, ఈ చిత్రంలో పాటలు, పద్యాలు దాదాపు 38 వున్నాయి. దేని ప్రత్యేకత దానిచే ఘంటసాల మాస్టారు యన్.టి.ఆర్ కు, కాంతారావుకు, రేలంగికి, నాగయ్యకు కూడా ప్లేబాక్ పాడటం చెప్పుకోదగ్గ విశేషం!

సముద్రాల వ్రాయగా సుశీల, లీల గానంచేయగా లవకుశలపై చిత్రీకరించిన గీతత్రయం (రామకథను వినరయ్య, వినుడు వినుడు రామాయణ గాధ, శ్రీరాముని చరితమును తెలిపెదమన్నా) వినవిందు, కనవిందు;

సీతారాములుగా అంజలీదేవి, రామారావులు ఆ త్రేతాయుగ సీతారాములే అన్నంత గొప్పగా తమ అభినయప్రజ్ఞతో ప్రాణం పోసారు. లక్ష్మణునిగా కాంతారావు,భరత, శతృఘ్నులుగా సత్యనారాయణ, శోభన్ బాబు, వాల్మీకిగా నాగయ్య, కౌసల్యగా కన్నాంబ, భూదేవిగా ఎస్. వరలక్ష్మి, హాస్యభూమికల్లో రేలంగి, గిరిజ, సూర్యకాంతం రమణారెడ్డి రాణించారు. నాగరాజు, సుబ్రహ్మణ్యం టైటిల్ రోల్స్ (లవకుశ) పోషించారు.

తెలుగులో నిర్మించబడ్డ తొలి గేవా కలర్ చిత్రం “లవకుశ”ను తమిళంలో కూడా నిర్మించారు. అటు లవకుశ గీతాలకు రీటా, సుకుమారి నృత్యగీతాలకు తగిన నృత్యరీతుల్ని సమకూర్చారు వెంపటి సత్యం. నాటి అయోధ్య నగరాన్ని తలపించేరీతిలో సెట్స్ రూపొందించారు కళాదర్శకులు టి.వి.ఎస్.శర్మ.

ఈ చిత్రంలోని పాటలు దాదాపు 14 మంది నేపధ్యగాయనీగాయకులు ఆలపించారు (ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం, మల్లిక్, రాఘవులు, లీల, సుశీల, జిక్కి, జానకి, రాణి, ఏ.పి.కోమల, వైదేహి, సరోజిని, సౌమిత్రి) బహుశా యిందరు గాయకులు మరే చిత్రానికి పాడలేదేమో! ఇది ఒక రికార్డు.

కరుణ రస ప్రధానమైన యీ చిత్రంలోని ప్రతి ఫ్రేమును యెంతో అర్ధవంతంగా, అందంగా, రసవత్తరంగా తీర్చిదిద్దారు దర్శకద్వయం పుల్లయ్య, శ్రీనివాసరావు, విషాద సన్నివేశాలను హృదయాలకు హత్తుకునే విధంగా చిత్రీకరించారు కెమెరామన్ పి.యల్.రాయ్. ఆ బాలగోపాలాన్ని ఆలరించి సమిష్టి కృషి పలితంగా రూపుదిద్దుకొని అందుకు తగ్గ ఘనవిజయాన్ని సాధించిన మహత్తర పౌరాణిక చిత్రం “లవకుశ”.

Released on March 29, 1963, Lavakusa, the first full length colour film in Telugu, broke all previous box office records. It won the silver medal as the best Telugu film at the National Film Awards. Its Tamil version, released on April 19, 1963 was also a massive hit. The dubbed Hindi version of Lavakusa too fared well.

Source: 101 C, S V Ramarao, The Hindu

Spread the love:

Comments