January 17, 2020

Lava Kusa (1934): The First Box-Office Hit of Telugu Cinema

Lava Kusa (1934): The First Box-Office Hit of Telugu Cinema

15.9.1931 న తొలి తెలుగు టాకీ “భక్త ప్రహ్లాద” విడుదలైంది. దాని దర్శకుడు H.M. రెడ్డి. సురభి కంపెనీ వారు ప్రదర్శించిన ప్రజాదరణ పొందిన నాటకాన్ని “భక్త ప్రహ్లాద” గా రూపొందించారు. దీనికి సంగీతాన్ని H.R. పద్మనాభ శాస్త్రి, సాహిత్యాన్ని చందాల కేశవదాసు సమకూర్చగా, హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, లీలావతిగా సురభి కమలాబాయి నటించగా, L.V. ప్రసాద్ చండామార్కులవారి శిష్యుని పాత్ర పోషించారు.

C. Pullaiah | H. M. Reddy

వాల్మీకి రామాయణంలోని రసవత్తర ఘట్టం ‘లవకుశ’ కథ. ప్రజావాక్కుకు విలువ ఇచ్చి రఘురాముడు సీతను పరిత్యజించటం, ఆమె వాల్మీకి ఆశ్రమంలో కుశలవులకు జన్మ ఇవ్వటం, వారు పెరిగిన తరువాత రాముని యాగాశ్వాన్ని బంధించి రామునితో తలపడటం ఇతివృత్తం. కరుణరసం, చైల్డ్ సెంటిమెంట్ ఉన్న కథ కావటం వలన ప్రేక్షకుల్ని ఆకర్షించింది. అంతటి శక్తివంతమైన కథ గనుక భారతీయ భాషలలో దీనిని తొమ్మిది సార్లు నిర్మించారు. మొదటిది 1919లో R. నటరాజముదలియార్ నిర్మించిన మూకీ చిత్రం. ఆ తరువాత 1934లో S. సౌందరరాజన్ (తమిళం) , అదే సంవత్సరంలోనూ ఆ తరువాత 1963లోనూ తెలుగులో C. పుల్లయ్య, 1951లో నానాభయభట్, 1967లో S.S. త్రిపాఠి, 1971లో K.S. అబ్బాస్ హిందీలోనూ, 1966లో అశోక్ ఛటర్జీ బెంగాలీలోనూ, 1978లో నరేంద్ర మిస్త్రీ గుజరాతీలోనూ నిర్మించారు.

Click here to go to Lava Kusa (1934) movie page.

1934లో C. పుల్లయ్యగారు ఈస్టిండియా కంపెనీ వారి కోసం తీసిన ‘లవకుశ’ చిత్రం ఏడాదిపైగా ఆడింది. (ఆయనే 1963లో రంగులలో తీసిన లవకుశ కూడా రికార్డు నెల కొల్పింది.) నాటి ప్రముఖ కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం రచన చేయగా ప్రభల సత్యనారాయణ సంగీతం సమకూర్చారు.

Lava Kusa Poster

పాత్రపరంగా ఔచిత్యభంగం కలిగినపుడు బూతు కూడా సమంజసమనిపిస్తుంది. ఆ చిత్రంలో రజకుడు భార్యని అనుమానించి ఆ ఘట్టాన్ని రామునితో పోలుస్తాడు. ఆ సందర్భంలో ఆ రజకుని చేత ‘ ఎల్లెల్లేనంజా, నీ నాటకము నాకెరుకనేదే పింజారినంజా సూరిగాడు నీకేసి సూసినాసూపు నీకొల్లు పులకరింతలతో ఎత్తించే కైపు’ అని పాడిస్తారు. దీనిని  1963లో వచ్చిన లవకుశలో రేలంగి ధరించిన రజకుని పాత్రచేత “నేనొల్లరిమావానీ పిల్లని’ అని పాడించారు. ఆనాటి లవకుశలో రజకునిగా B.C. వెంకటాచలం హాస్యం పలికించారు.

రంగస్థలంపై శ్రీకృష్ణుడు, సత్యవంతుడు , అభిమన్యుడు మొదలైన పురుష పాత్రల్లో రాణించిన నటి సీనియర్ శ్రీరంజని ఈ చిత్రంలో సీతగా నటించి నీరాజనాలందుకుంది. శ్రీరామునిగా పారుపల్లి సుబ్బారావు, లవకుశలుగా భీమారావు, మల్లికార్జునరావు నటించారు.

అదే సంవత్సరం దేవకీబోస్ హిందిలో ‘సీత’ చిత్రాన్ని నిర్మించారు. ఆ సెట్స్ను లవకుశ చిత్ర నిర్మాణంలో ఉపయోగించుకున్నారు. C. పుల్లయ్యగారి దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం సావిత్రి కాగా రెండవ చిత్రం లవకుశ నాటి ప్రేక్షకుల్లో చెరగని ముద్రేసింది. ఈ చిత్రం కలకత్తాలో నిర్మించారు. 1963లో C. పుల్లయ్యగారు దర్శకత్వం వహించిన శంకరరెడ్డి గారి రంగుల లవకుశ చిత్రానికి పుల్లయ్యగారి అబ్బాయి C.S. రావు కూడా కొంత భాగం డైరెక్ట్ చేశారు. ఇందులో N.T.R, అంజలీదేవి సీతారాములుగా నటించి నీరాజనాలందుకున్న విషయం పాఠకులకు తెలిసిందే!

Made apparently on the used sets of Debaki Bose’s Serta (1934). It is the Ramayana story of Seeta (Sriranjani) who retires to the forest and gives birth to twin boys, Lava (Bhimarao) and Kusa (M. Rao), who later take on the might of Rama (Subba Rao) unaware that he is their father. Probably the first film to receive a wide release in the AP countryside, it was singer Sriranjani’s film debut and a major hit running in some theatres for over a year. Pullaiah remade the film (1963) with N.T. Rama Rao and Anjali Devi.

Source: 101 C, S V Ramarao

Spread the love:

Comments