May 19, 2020

Lakshadhikari (1963): Trendsetting Blockbuster Suspense Thriller #TeluguCinemaHistory

Lakshadhikari (1963): Trendsetting Blockbuster Suspense Thriller #TeluguCinemaHistory

ప్రజానాట్య మండలికి విశేష సేవలందించి సారధి వారి పలుచిత్రాలకు ప్రాడక్షన్ మేనేజర్గా అనుభవం గడించిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి, మరో మిత్రుడు డి.వెంకటపతి రెడ్డితో కలసి రవీంద్రా ఆర్ట్స్పతాకంపై నిర్మించిన తొలిచిత్రం “లక్షాధికారి”.

Click Here to go to Lakshadhikari (1963) Movie Page.

లక్షాధికారి రంగయ్య వద్ద సీతయ్య నమ్మిన బంటుగా పని చేస్తుంటాడు, రంగయ్య బావమరది శివం డబ్బు కోసం రంగయ్యును పీడిస్తుంటాడు. వజ్రాల వ్యాపారి హత్యానేరంపై రంగయ్య జైలుకెళతాడు.

రంగయ్య కొడుకుని దుండగులు కిడ్నాప్ చేస్తారు. ఆ బిడ్డ కృష్ణానదిలో కొట్టుకుపోతే అచ్చమ్మ, పిచ్చయ్య దంపతులకు దొరుకుతారు. రంగయ్య ఆస్తి వ్యవహారాలను సీతయ్య చూస్తూవుంటాడు. ఇది కథకు పూర్వ రంగం.

ప్రసాద్ పెరిగి పెద్దవాడయ్యాడు. సీతయ్య కూతురు పద్మ కూడా పెద్దదౌతుంది. వారిద్దరూ ప్రేమించుకొంటారు. సీతయ్య ప్రసాద్ ప్రతిభను గుర్తించి ప్రసాద్ ప్రొడక్ట్స్ పేరుతో మందుల కంపెనీ స్థాపించి దాని బాధ్యతను ప్రసాద్ కు అప్పజెబుతాడు.

జైలునుంచి వచ్చిన రంగయ్య సీతయ్యను కలుసుకొంటాడు. అయితే రంగయ్య మీద హత్య ప్రయత్నం జరుగుతుంది. దుండుగుల బారినుంచి రంగయ్యను ప్రసాద్ రక్షించి  ఆ ప్రయత్నంలో దెబ్బలుతిని ఆస్పత్రిలో చేరతాడు.

తరువాత మారువేషంలో ప్రసాద్ పద్మసహాయంతో పానకాలు అనే రౌడీ నుంచి రహస్యాలు తెలుసుకొంటాడు. ఇంతలో ముసుగు మనిషి పానకాలును కాల్సి చంపి పారిపోతాడు. హీరో ప్రసాద్ ఆ ముసుగుమనిషిని పట్టి పోలీసులకు వప్పజెబుతాడు. పద్మ ప్రసాద్ ల వివాహంతో కథముగుస్తుంది.

ఈ సినిమాలో నాయికా నాయకులుగా కృష్ణకుమారి, యన్.టి.రామారావు, తండ్రి రంగయ్య పాత్రలో నాగయ్య నటించగా తేనెపూసిన కత్తిలాంటి విలన్ పాత్రని గుమ్మడి సమర్ధవంతంగా పోషించారు. రేలంగి, గిరిజ హాస్యాన్నందించగా, ఇతర పాత్రల్లో రమణారెడ్డి, మిక్కిలినేని, సూర్యకాంతం, గెస్ట్ గా కె.వి.యస్.శర్మ నటించారు.

నార్ల చిరంజీవి మాటలు వ్రాసిన యి చిత్రంలో సి. నారాయణరెడ్డి వ్రాసిన దాచాలంటే దాగదులే, మబ్బులో ఏముంది, నా చెంపతాకగానే, చెలి నీచేయి కందెనేమో ఆరుద్ర వ్రాసిన ‘ఎలాగో, ఎలాగో వున్నది’, కొసరాజు వ్రాసిన ‘అద్దాల మేడవుంది గీతాలు హిట్ అయ్యాయి. వాటికి రసవత్తర స్వరాలను సమకూర్చారు సంగీత దర్శకులు టి.చలపతిరావు.

దర్శకులు విక్టరీ మధుసూదనరావు యీ చిత్రంలో కొత్త తరహాలో హారర్ టచ్స్ యిచ్ఛారు. అది అర్ధరాత్రివేళ గడియారం గంటలు మ్రోగటం, గుడ్ల గూబల చూపులు భయంకరమైన అరుపులు – యిటువంటివి దుర్మార్గానికి సూచనగా ప్రవేశపెట్టారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

‘మబ్బులో ఏముంది’ పాటను సి.నారాయణరెడ్డి వ్రాయగా రేడియోలో లలిత గీతంగా ప్రసారమైంది. దానికి మంచి స్పందన లభించటంతో ఈ చిత్రంలో ఉపయోగించుకున్నారు.

In the song, achammaku nithyamu seemanthamaayane Ramana Reddy and Suryakantham appear in a frame as Lord Krishna and Sathyabhama. A song was filmed on Krishnakumari, wearing a swim suit, at the Guindy Engineering college swimming pool but the censors deleted it citing that the heroine should not wear a swim suit.

The exterior portions of Chandamama buildings were shown in the movie as the college where Krishnakumari and Girija study. The revolver sound effects were created by Peketi Sivaram. Both Krishnakumari and NTR acted in 11 films each in 1963. They starred together in five of them.

At the end of the song, “mabbulo yemundi” the lead pair had to walk hand in hand on the sea shore. As they were walking, a giant wave swept them away. Krishnakumari did not know swimming and thought she was drowning. However NTR held her hand tight and saved her. Recalling the incident Krishnakumari then said it was like a rebirth for her.

Lakshadhikari was released on 27 September 1963. The film performed well at the box office, and became a trendsetter for more suspense-filled films in Telugu.

Source: 101 C, S V Ramarao, The Hindu, Wiki

Spread the love:

Comments