February 29, 2020

Laila Majnu (1949): An Ancient Epic of Love #TeluguCinemaHistory

Laila Majnu (1949): An Ancient Epic of Love #TeluguCinemaHistory

విషాదాంత ప్రేమ కథ చిత్రాలు చక్కని ట్రీట్మెంట్ ఉంటే విజయం సాధించి తీరుతాయి అని తెలుగు తెర పై నిరూపించిన మొదటి చిత్రం భరణి వారు నిర్మించిన ‘ లైలా మజ్ను’ చిత్రాన్ని పేర్కొనాలి.

చిత్రకథ ఇరాక్ ముస్లిం వాతావరణానికి చెందినది. లైలా తండ్రి ఒక ప్రాంతానికి సుల్తాన్ వంటి హోదాలో ఉన్న సంపన్నుడు. ఖయిస్  ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. చిన్నప్పట్నుంచి ఒకే స్కూల్లో చదువు. ఇద్దరి మధ్య ఉన్న చనువు వారితో పాటు పెరిగి ప్రేమగా మారుతుంది. ఇందుకు లైలా తండ్రి అంగీకరించడు. ఆమెకు మరొక సంబంధం నిశ్చయించి ఇరాక్ పంపుతాడు. ఖయిస్ పిచ్చివాడై ( మజ్ను) పోతాడు. చివరకు ఎడారిలో ఆ ఇద్దరూ తుదిసారిగా కలుసుకుని ఈ లోకంలో మరణించి స్వర్గంలో కలుసుకొని ‘చేరరారో శాంతిమయమీ సీమ’ అని హాయిగా పాడుకుంటారు.

Click Here to go to Laila Majnu (1949) Movie Page.

ఈ కథకు ‘ దేవదాసు’ కు దగ్గర పోలికలు కనిపిస్తాయి. ప్రేమికుల్లో ఒకరు కలవారు మరొకరు లేనివారు. లేకపోతే ఒకరు గొప్ప కులం వారైతే మరొకరు పేద కులం వారు. అక్కడ డ్రామా బాగా పండుతుంది. సుఖవంతమైన రాజ్ కపూర్ ‘ బాబి’ చిత్రం కూడా ఈ ఫార్ములాతో నడిచినదే.

ఈ లైలామజ్ను కథను భారతదేశంలో ఇంతవరకూ 14 మంది నిర్మించారు. రెండు మూకీ చిత్రాలు, హిందీలో జె.జె.మదన్, కాంజీభాయ్ రాథోడ్ (1931,నయ్యర్ (1945), కె. అమర్నాథ్ ( 1953), హెచ్.ఎస్.రావల్ (1976) నిర్మించగా పర్షియా భాషలో 1936లో ఈస్టిండియా ఫిలిం కంపెనీ, 1940లో పంజాబీ లో ధరంవీర్ సింగ్, తమిళంలో ఎఫ్. నాగూర్ ( 1950), మలయాళంలో పి. భాస్కరన్ ( 1962), బెంగాలీలో ( 1976) సచిన్ అధికారి. తెలుగులో పై చిత్రాన్ని పి. ఎస్. రామకృష్ణ రావు స్వీయదర్శకత్వంలో 1949లో నిర్మించారు.

నాయకానాయికలుగా భానుమతి, అక్కినేని నటించగా ఇతర ముఖ్య భూమికల్ని సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, శివ రావు, ముక్కామల, శ్రీరంజని పోషించారు. తిరునాస్కురు  సోదరీమణులు లలిత, పద్మిని ఒక నృత్య సన్నివేశంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి నృత్య దర్శకత్వం వహించిన వేదాంతం రాఘవయ్య, కెమెరామెన్ గా పనిచేసిన బి.ఎస్.రంగా తరువాత దర్శకులయ్యారు. నిర్మాణ వ్యవహారాలు చూసిన డి. ఎల్. నారాయణ ఆ తర్వాత నిర్మాతగా మారారు.

Besides excellent photography, sound designing (by V. Srinivasa Raghavan under whom later day’s popular director K. Viswanath worked as an assistant), the period sets created by art directors Goadgoankar and K. Nageswara Rao and C.R. Subburaman’s soul stirring music with ‘Preme neramouna…’ (rendered by Bhanumathi) the evergreen hit, ‘O Priyathama… Payanamaye Priyathama Nanu Marachipokuma…’ (rendered by Ghantasala) and the dance sequence featuring Lalitha and Padmini, contributed to the runaway success of Laila Majnu.

ANR, Bhanumathi Ramakrishna

While the opulent palace, garden and other sets were put up in the floor, the desert set with a pond, palm trees (to resemble date trees found in deserts) and sand dunes were created in the open space between the studio and the recording theater and the scenes were shot there during the nights for the right effect. The result of this entire effort was reflected in audience’s appreciation of the movie.

Source: 101 C, S V Ramarao, The Hindu

Spread the love:

Comments