అనగనగా ఒక రాజు, ఆ రాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక మోహినిని ప్రేమించి రాజ్యానికి తీసుకువచ్చి రెండవ భార్యగా స్వీకరిస్తాడు. నిజానికి ఆమె ఒక రాక్షసి. రాత్రి వేళల్లో రాక్షసిగా ఏనుగుల్ని చంపి తిని ఆ నేరాన్ని పెద్ద రాణిపై వేస్తుంది. అది నమ్మిన రాజు పెద్దరాణిని అడవులకు పంపిస్తాడు. ఆమె గర్భవతి, అడవిలో కోయగూడెంలో ఆమె జన్మనిచ్చిన కథానాయకుడు పెరిగి అన్ని విద్యల్లో ప్రవీణుడౌతాడు.

ఆకాశంలో విహరించే కీలుగుర్రాన్ని అధిరోహిస్తాడు. దొంగల బారి నుంచి ఒక కథానాయికని కాపాడుతాడు. హీరో సంగతి తెలిసిన మోహిని తనకు తలనొప్పిగా ఉందని అందుకు తగ్గ మందు తెమ్మని కథానాయకుడిని పంపుతుంది. కీలుగుఱ్ఱం సహాయంతో ఆ మందు తెచ్చే ప్రయత్నంలో ఎన్నో సాహసాలు చేస్తాడు కథానాయకుడు. ఆ మందు కంటే విలువైన రాక్షసి ప్రాణాలు చిన్న పురుగులో ఉండటం గమనించి వాటిని సంగ్రహిస్తాడు. తల్లిని ఉరి తీసే సమయానికి అక్కడకు వచ్చి రాక్షసిని అంతమొందిస్తాడు కథానాయకుడు.
Click Here to go to Keelu Gurram (1949) Movie Page.
ఇది జానపద చిత్ర కథ. ఈ కథలో ఇద్దరు ముగ్గురు కథానాయికలు హీరోకి తారసపడతారు. ఇంటర్వెల్ కు ముందుగా కథానాయకుడు ప్రవేశిస్తాడు. అక్కడినుంచి హీరోయిజం కు ప్రాధాన్యత పెరుగుతుంది. బాలరాజు లోని పాత్ర కంటే కథానాయకుడిగా అక్కినేని హీరోయిజం కు ఈ చిత్రం ఎంతో దోహదం చేసిందని చెప్పాలి.
వ్యాoపూగా రాక్షసి వేషంలో అంజలీదేవి, కథానాయికగా జూనియర్ లక్ష్మీరాజ్యం, సూర్య శ్రీ హాస్య పాత్రల్లో రేలంగి, కనకం, ఇతర పాత్రల్లో ఏవి సుబ్బారావు, కోటేశ్వరరావు, సురభి కమలాబాయి, నాగరత్నం నటించారు.

తాపీ ధర్మారావు రచన చేయగా ఘంటసాల తొలిసారిగా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ( బుక్ అయిన చిత్రాలు లక్ష్మమ్మ, మన దేశం. విడుదలైనది కీలుగుర్రం). ‘ కాదు సుమా కల కాదు సుమా’ పాట పాపులర్ అయ్యింది. ఈ పాటను ఘంటసాల తో పాటు వక్కలంక సరళ పాడారు. హవాయిన్ గిటార్ అనే వాయిద్యాన్ని పాట తాలూకు నేపథ్య సంగీతంలో ప్రథమంగా ఉపయోగించారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ‘ ఎంత కృపామతివే భవాని, ఎవరు చేసినా కర్మవానుభవింపక, ఎంతనందనంబాయనాహో, చూచి తీరవలదానందం, చెంపవేసి నాకింపు చేసితివే’ చెప్పుకోదగ్గవి. అంజలీదేవికి మరో నటి, గాయని, నిర్మాత అయిన సి. కృష్ణవేణి ప్లేబాక్ పాడడం చెప్పుకోదగ్గ విశేషం.
ఆ చిత్రాన్ని తమిళంలో “మాయకుదిరై” పేరిట నిర్మించారు. హీరోయిజానికి నాంది పలికిన ‘కీలుగుఱ్ఱం’ స్వీయ దర్శకత్వంలో శోభనాచల పిక్చర్స్ బ్యానర్ పై మీర్జాపురం రాజా నిర్మించారు.
Source: 101 C, S V Ramarao