March 5, 2020

Jeevitham (1950): Vyjayamanthimala’s Telugu Debut and Highest Grossing Film of 1950 #TeluguCinemaHistory

Jeevitham (1950): Vyjayamanthimala’s Telugu Debut and Highest Grossing Film of 1950 #TeluguCinemaHistory

“ఈ అగ్ని సాక్షిగా నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను” అధినాయకుడు సిగరెట్ కోసం అగ్గిపుల్ల వెలిగించడం, అది వెంటనే ఆరిపోవడం… ఇది ఆ కథానాయకుడు నాయికను మోసం చేయబోతున్నాడు- అనే అర్థం వచ్చేలా దర్శకుడు తీసిన సింబాలిక్ షాట్. ఇది ఏ.వి.యం వారు మూడు భాషల్లో నిర్మించిన ‘ జీవితం’ చిత్రానికి ప్రాణం వంటి సన్నివేశం. ఇందులో నాయకుడు మూర్తి ( సి.హెచ్.నారాయణరావు), నాయిక వరలక్ష్మి ( ఎస్. వరలక్ష్మి), దర్శకులు యం. వి రామన్.

Click Here to go to Jeevitham (1950) Movie Page.

ఇహ అసలు కథకు వస్తే మూర్తి ఏదో పనిమీద పల్లెటూరు వచ్చి అక్కడ కనిపించిన పల్లెటూరి అందాల రాశి అభం శుభం ఎరుగని వరలక్ష్మిని మాటలతో మోసగించి అనుభవించి పట్నం వెళ్ళిపోతాడు.

పట్నంలో రాణీని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. అయితే ఆ రాణి పతి అనే అతనితో గొడవపడగా తరువాత ఆ రగడ ప్రేమగా మారుతుంది. ఇక్కడ పల్లెటూల్లో వరలక్ష్మి అవమానం భరించలేక పట్టణానికి వచ్చి మూర్తిని కలుసుకుంటుంది. ఆమె ఎవరో తెలియనట్లు నటిస్తాడు మూర్తి. వంచింపబడ్డ వరలక్ష్మి సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకోబోతుంది. ఎవరో రక్షిస్తారు. ఒక బిడ్డను కంటుంది. ఆ బిడ్డను పతి ఇంటి ముందు వదలగా అతను పసివాడ్ని ఆఫీసుకు తీసుకెళ్లడం, వాడ్ని సాకటంతో నానా యాతన పడతాడు. అతని అనుమానిస్తుంది రాణి. చివరకు మూర్తి చేసిన మోసం బయటపడి క్షమించమని చెప్పి వరలక్ష్మిని చేరదీస్తాడు.

ఇందులో చెప్పుకోదగ్గది సుదర్శనం అందించిన సంగీతం, ఎస్. వరలక్ష్మి పాడిన ‘మేలుకోండి తెల్లవారె తెల్లగా’ అన్న పాట, రాణీ-పతిల పై చిత్రీకరించిన రెండు పాటలు ‘ప్రియమైన రాణీ మోహినీ డడడా’. ‘మన మనసూ మనసూ ఏకమై’ అన్నవి. యం.ఎస్. రామారావు పాడిన ‘ఇదేనా మా దేశం. ఇదా భారతదేశం’ అన్ననేపథ్య గీతం కూడా హిట్టయ్యింది.

తోలేటి వెంకటరెడ్డి మాటలు, పాటలు రాశారు. సి.ఎస్.ఆర్ ఆంజనేయులు రాణి తండ్రి పాత్రలో ‘ ఆ రోజుల్లో నేను కాలేజీలో చదివే రోజుల్లో’ అన్న డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. విలనీ టచ్ ఉన్న హీరో పాత్రలో సి.హెచ్. నారాయణరావు,కథానాయిక పాత్రలో ఎస్. వరలక్ష్మి రాణించారు. అయితే ఈ చిత్ర విజయానికి ముఖ్యకారకులుగా చెప్పుకోవలసినవి రాణీ పతి పాత్రలు. వీటిని అప్పుడే సినీరంగంలో ప్రవేశించిన వైజయంతిమాలా, అంతకముందు హాస్యనటునిగా పోషించారు. వైజయంతిమాల నృత్యాలు, అందం, కొత్త తరహాలో పలికిన సంభాషణాశైలి చెప్పుకోదగ్గవి. విషాదం, కరుణ, శృంగారం, హాస్యం ఇవ్వన్నీ సమపాళ్లలో మేళవించబడ్డ మేటి చిత్రం ‘జీవితం’.

T R Ramachandran, Vyjayanthimala

ఎమ్.వి. రామన్ సమర్థుడైన దర్శకుడు. “జీవితం” చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హిట్ చేశారు. అక్కినేని, వైజయంతిమాల నటించిన తమిళ చిత్రం “అతిశయ పెన్” కు ఆయనే దర్శకుడు. ఆయన దర్శకత్వం వహించిన హిందీ చిత్రం “భాయీ భాయీ” దాన్ని తెలుగులో “శభాష్ రాజా” పేరిట సుందరలాల్ నహతా భరణీ రామకృష్ణ దర్శకత్వంలో రూపొందించారు.

The film became a hit at the box office similar to the Tamil version, which was released one year earlier. Subsequently, A. V. Meiyappan made the film in Hindi as Bahar the following year, which was directed by M. V. Raman with Vyjayanthimala reprising her role in all three versions. At the end of its theatrical run, Jeevitham completed its 200th day and was the highest grossing Telugu film of 1950.

Source: 101 C, S V Ramarao, Wiki

Spread the love:

Comments