May 5, 2020

Jayabheri (1959): Award Winning Devotional Biographical Feature #TeluguCinemaHistory

Jayabheri (1959): Award Winning Devotional Biographical Feature #TeluguCinemaHistory

విద్యనభ్యసించి అగ్రస్థానంలో నిలిచినవాడు కాశీనాథ్ (అక్కినేని),. అతనికి అన్న విశ్వనాథ్ (గుమ్మడి). వదిన (శాంతకుమారి) అంటే ఎంతో గౌరవం, అభిమానం. ఒక సందర్భంలో బచ్చెన భాగవతులు ఇచ్చిన ప్రదర్శన చూడడానికి వెళ్ళన కాశీనాథ్ అందులో ప్రధానపాత్ర వహించి సవాలు చేసిన మంజుల (అంజలీదేవి)తో ప్రతిసవాలు చేస్తాడు. వారిద్దరిమధ్యా జరిగిన సంగీత సాహిత్యపరమైన వివాదం ఇద్దరిమధద్యా ప్రణయానికి దారితీస్తుంది. వారి జానపద కళల్లో కూడా మానవీయ విలువలున్నాయని గ్రహిస్తాడు కాశీ. మంజులు-కాశీల వివాహానికి కులపెద్దలు అడ్డుచెబుతారు. ఇచ్చిన మాట నిలుపుకోవడంకోసం అన్నగారికి దూరమై ఇల్లు వదిలి మంజులను దేవాలయంలో వివాహం చేసుకుంటాడు కాశీనాథ్.

Click Here to go to Jayabheri (1959) Movie Page.

ఆక్కడినుంచి వారిద్దరూ, వారి బృందం (రమణారెడ్డి, కమలాబాయి)తో చేరి ‘జానుతెనుగే మేము, జాతి వెలుగే మేము, జగమెల్ల మార్ర్మోగ జయభేరి మ్రోగించమా’ అంటూ దేశ సంచారం చేస్తూ కళారూపాల్ని ప్రదర్శిస్తారు. చివరకు విజయనగర సామ్రాజ్యం చేరుతారు. ఆ దేశ రాజు విజయానందుడు (యస్.వి.రంగారావు) మారువేషంలో వీరి ప్రదర్శన తిలకించి ముగ్ధుడై తన కొలువుకు ఆహ్వానిస్తాడు.

నిండుసభలో సరికొత్త రాగంలో ‘రసిక రాజ తగువారము కామా’ అనే పాటతో సభికుల్ని మెప్పిస్తాడు కాశీనాథ్. రాజనర్తకి అమృత (రాజసులోచన) కాశీనాధ్నిఆకర్షించాలని ప్రయత్నిస్తుంది. ఇందుకు రాజగురువు (ముక్కామల) సహకరిస్తాడు. ఫలితంగా కాశీనాథ్ మద్యానికి బానిస కావడంతో అతని పతనం ప్రారంభమౌతుంది. అంతటి పతనావస్థలోనూ హరిజనుడి ఆలయప్రవేశం కోరి భక్తనందుని చరిత్రను గానం చేస్తాడు.

ఇక్కడ విశ్వనాధశాస్త్రి కుటుంబాన్ని సనాతనులు వెలివేస్తారు. మరిదిపై మమకారాన్ని పెంచుకున్న వదిన మరణానికి చేరువకాగా కాశీనాథ్ దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఆమెకు స్వస్థత చేకూరి అందరూ ఏకమౌతారు. ఈ కథను ప్రతి ఫ్రేమూ రసవత్తరంగా చిత్రీకరించారు దర్శకులు పి.పుల్లయ్య, ఆచార్య ఆత్రేయ పదునుదేలిన పాత్రోచిత సంభాషణలు చిత్రానికి నిండుదనాన్నిచ్చాయి. నటీనటులందరూ హేమాహేమీలే అన్నదమ్ముల మధ్య గల అనురాగాన్ని. అభిమానాన్ని ఆంతర్యంలో దాచుకుని వాటి విలువను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు – అక్కినేని, గుమ్మడి. వారితో సమవుజ్జీగా నటించారు అంజలీదేవి, శాంతకుమారి.

జయభేరి’ చిత్రం గూర్చి ఉదహిరించినప్పుడు చిత్రంలో సంగీత సాహిత్యాలని గూర్చి చెప్పుకోవల్సిందే. పెండ్యాల నాగేశ్వరరావు కూర్చిన స్వరాలు సంగీత సరస్వతికి సముచిత కంఠాభరణాలు. ఘంటసాల సంగీతానికి సంబంధించి ఎక్కువ ఏ కార్యక్రమం జరిగినా అందులో వినిపించే పాట మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన ‘రసికరాజు తరువారముకామా’. వారే రాసిన ‘రాగమయీ రావే’, ‘మది శారదాదేవి మందిరమే’ ఆగుద్ర రాసిన ‘యమునాతీరమున’, శ్రీశ్రీ రాసిన ‘నందుని చరితము వినుమా’ ఎనదరిన మధురగీతాలు. పతాక సన్నివేశంలో తమిళ గాయకుడు టి. ఎమ్. సౌందరరాజన్ పాడిన ‘దైవము నీవేనా’ అన్న గీతం, రాజనర్తకి పై చిత్రీకరించిన జావళి ‘నీవెంత నెరజాణవౌర పాటను యం.ఎల్.వసంతకుమారి గానం చేయడం చెప్పుకోదగ్గ విశేషాలు. చిత్రకథనానికి సంబంధించిన సవాలు పాట, శంతనమహారాజు ప్రణయగీతం, పారిజాతాపహరణం హాస్యగీతం చెప్పుకోదగ్గవి.

మల్లాది రచనతో, పెండ్యాల స్వరరచనతో, ఆక్కినేని నటనతో పునీతమైన ‘జయభేరి’ చిత్రం 9.4.1959న విడుదలయింది. దీనికి రాష్ట్రపతి యోగ్యతా పత్రం లభించింది.

Released on April 9, 1959 Jayabheri had a good run and earned decent profits. Besides it won the certificate of merit at the national awards and the Filmfare award for best picture in Telugu.

Source: 101 C, S V Ramarao

Spread the love:

Comments