April 30, 2020

Chenchu Lakshmi (1958): Musical Mythology #TeluguCinemaHistory

Chenchu Lakshmi (1958): Musical Mythology #TeluguCinemaHistory

హిరణ్యకశిపుడు రాక్షసరాజు, దేవేంద్రునిపై దండెత్తి అతని భార్యను చెరపట్టిన దుస్సాహిసి, ఇతని భార్య లీలావతి. వీరికి జన్మించిన కుమారుడు ప్రహ్లాదుడు. తల్లి గర్భంనుంచే ‘ఓం వమోసరాయణ’ అంటూ నారాయణ మంత్రాన్ని వల్లించిన భక్తుడు. విష్ణుద్వేషియైన హిరణ్యకశ్యపునికి ఇది గిట్టదు. కుమారుని మనసు మార్చాలని సామదానభేదడండోపాయాల ద్వారా ప్రయత్నించి విఫలుడౌతాడు. చివరకు ఒక స్తంభంలో విష్ణువుని చూపమని ప్రహ్లాదుని సవాలుచేస్తాడు తండ్రి హిరణ్యకశ్యపుడు. అప్పుడు ప్రహ్లాదుని మొర విని మహావిష్ణువు నరసింహావతారం దాల్చి ఆ స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశ్యపుని వధించి దుష్టశిక్షణ చేస్తాడు. ఇది ఒక కథ.

Click Here to go to Chenchu Lakshmi (1958) Movie Page.

దూర్వాస మహాముని శాపప్రభావంవల్ల లక్ష్మీదేవి చెంచుగూడెంలో చెంచులక్ష్మిగా జన్మిస్తుంది. ఆమెను ప్రేమిస్తాడు నరసింహుడు (శాంతించిన నరసింహుని మరో రూపం) కారణాంతరాలపల్ల వారి వివాహానికి విఘాతం ఏర్పడుతుంది. దేవలోకంనుంచి వచ్చిన లక్ష్మీదేవి అంశ తన భర్త విష్ణుమూర్తిని వెతుకుతూ వచ్చి చెంచులక్ష్మితో ప్రణయం సాగిస్తున్న నరసింహుని చూసి తల్లడిల్లుతుంది. నారదుని వివరణతో లక్ష్మి చెంచులక్ష్మిలో లీనమై నరసింహుడు విష్ణువుగా తిరిగి ఏకమౌతారు. ఇది మరోకథ.

ఈ రెండు కథల్ని సమన్వయపరచి సదాశివబ్రహ్మం అద్భుతమైన రీతిలో ఒక కథగా రూపొందించగా దానిని దర్శకనిర్మాత బి.ఏ.సుబ్బారావు రసవత్తరంగా తెరకు అనువదించారు.

అటు విష్ణుమూర్తిగారూ, ఇటు చెంచు ప్రియునిగానూ అక్కినేని నాగేశ్వరరావు నటించగా టైటిల్ పాత్రను అంజలీదేవి పోషించారు. హిరణ్యకశపుని పాత్రలో ఎస్.వి.రంగారావు నిప్పులు కురిపించారు. అతని భార్య లీలావతిగా పుష్పవల్లి, కుమారుడు భక్త ప్రహ్లాదగా మాస్టర్ బాబ్జి నటించారు. వారిద్దరూ నిజజీవితంలో తల్లీకొడుకులే. నారద పాత్రకు హాస్యాన్ని జోడించి కొత్తతరహాలో ఆవిష్కరించారు రేలంగి. ఆ చిత్రానికి ప్రాణంపోసింది సదాశివబ్రహ్మం స్క్రిప్టు. అంతకుమించి చెప్పుకోదగినది ఆరుద్ర రాజేశ్వరరావు కాంబినేషన్లో రూపొందిన అద్భుతగీతాలు. కొన్ని పాటలు సదాశివబ్రహ్మం కూడా రాశారు.

ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు ముందుగా భానుమతిని తరువాత పద్మినిని బుక్ చేసి కొద్దిపాటి షూటింగ్ జరిపినా కారణాంతరాల వల్ల అంజలీదేవికి ఆ పాత్ర దక్కింది. అలాగే హీరో పాత్రకు ముందుగా పి.బి. శ్రీనివాస్ చేత పాడించి రీకార్డు చేసినా తరువాత ఘంటసాల చేత మళ్లీ పాడించి వాటినే చిత్రంలో ఉపయోగించుకున్నారు.

ప్రహ్లాదునిపై చిత్రీకరించిన ‘పాలకడలిపై శేషతల్పమున’, అన్న పాటలు నాయికానాయకులపై చిత్రీకరించిన యుగళగీతాలు, ‘చెట్టులెక్కగలవా, ఓ నరహరి పుట్టలెక్కగలవా’, ‘ఆనందమాయె అరి నీలవేణి’, ‘కానగ రావో వో శ్రీహరి రావో’ నారదునిపై చిత్రీకరించిన ‘కరుణాలవాల ఇది నీదు లీల’ శ్రావ్యంగా ఉన్నాయి. సి.నాగేశ్వరరావు ఛాయాగ్రాహణం కనువిందు చేస్తుంది. చెంచులక్ష్మి కథను 1943లో తీయగా, ‘భక్తప్రహ్లాద’’ను తిరిగి 1967లో ఏ.వి.యం.వారు నిర్మించారు.

ఏమయినా 9.4.1958న విడుదలయిన చెంచులక్ష్మి సంగీతపరంగా ప్రేక్షకుల్ని పరవశింపచేసింది. ఈ చిత్రాన్ని తమిళ భాషలో కూడా నిర్మించి 20.5.58న విడుదల చేయగా అది కూడా విజయం సాధించింది.

Veteran actress Radhakumari’s father Ramanamurthy was the theatre’s manager. An ardent fan of Anjali Devi, Radhakumari, then not yet into films, went to see her matinee idol. The crowd was so huge that she was not allowed by the security guards even though she mentioned her father’s name. Finally she could enter and catch a glimpse of Anjali Devi. Interestingly, Radhakumari later shared screen space in many movies with Anjali Devi.

Source: 101 C, S V Ramarao, The Hindu

Spread the love:

Comments