May 13, 2020

Batasari (1961): Telugu Cinema Reminiscence #TeluguCinemaHistory

Batasari (1961): Telugu Cinema Reminiscence #TeluguCinemaHistory

మీకు నచ్చిన కొన్ని సినిమాల పేర్లు చెప్పమని అడిగితే ఆక్కినేని నాగేశ్వరరావు చెప్పవాటిల్లో తప్పకుండా ‘బాటసారి’ వుంటుంది. కారణం బహుతక్కువ సంభాషణలతో భాషాతీతమైన అభినయాన్ని ఆ చిత్రంలోని సురేంద్ర పాత్రలో ఆయన ఆవిష్కరించారు.

Click Here to go to Batasari (1961) Movie Page.

ఈ చిత్రానికింటే ముందుగా దేవదాసు, ముద్దుబిడ్డ, చిత్రాలు బెంగాలీ రచయిత శరత్ వ్రాసిన నవలల ఆధారంగా చిత్రలుగా తీయబడ్డాయి.

భరణివారు శరత్ వ్రాసిన ‘బడదీది’ అనే చిన్న నవలను “బాటసారి” పేరిట నిర్మించారు.

జమిందారు సురేంద్రకు ఆస్తి వుంది, పుస్తకపరిజ్ఞానం వుంది. పుస్తక పఠనం అతనికి ముఖ్యం. ఆకలి వేస్తుంది అన్నం తినాలి అనే కనీస లోకజ్ఞానం కూడా లేని అమాయకుడు. ఒకసారి యింట్లో చిన్నపాటి మాట పట్టింపు రాగా యిల్లు వదలి వేరే చోటుకి వెళతాడు. అక్కడ మాధవి యింట్లో ఆశ్రయం దొరుకుతుంది. ఆమె చెల్లెలుకు పాఠలు చెప్పే వుద్యోగం. ఆ యింట్లో వున్నంతకాలం అతని వింత ప్రవర్తనకు జాలి పడుతుంది మాధవి. ఆమెపట్ల అతనికి గౌరవభావం ఏర్పడుతుంది.

తరువాత సురేంద్ర తన జమీకి వెళ్ళిపోతాడు. పెళ్ళవుతుంది. భార్యకు అహంకారం ఎక్కువ. ఆక్కడ పనిచేసే గుమాస్తావల్ల మాధవి ఆస్తులకు అన్యాయం జరుగుతుంది. అది తెలుసుకున్న మాధవి సురేంద్రను ప్రశ్నించటానికి వస్తే గుమాస్తా కలుసుకోనివ్వడు. ఆమె తిరిగి వెళుతూ దోవలో తన పేరిట సురేంద్ర “మాధవీపురం’ గ్రామాన్ని కట్టించాడని తెలుసుకొని ఆనందపడుతుంది. సురేంద్ర రికార్డులు తిరిగేస్తూ తను అభిమానించిన మాధవికి తన పేరిట అన్యాయం జరిగిందని తెలుసుకొని, తన అనారోగ్యం కూడా తెక్కవేయ్యకుండా గుర్రంమీద వెళ్ళి ఆమెను కల్పుకొని క్షమూపణకోరి ఆమె చేతుల్లో తుదిశ్వాస విడుస్తాడు.

హీరో పాత్రలో అక్కినేని ‘ఊ ఊ’ అంటూ అధ్బుతంగా నటించారు. చాలా చిత్రాల్లో నటనలో డామినేషన్ ప్రదర్శించే భానుమతి యిందులో పాత్రపరిధికి లోబడి నటించారు. హీరో భార్యగా జానకి, మాధవి స్నేహితురాలు మనోరమగా దేవిక ఇతరపాత్రల్లో లింగమూర్తి, రామన్నపంతులు నటించారు.

మానసిక విశ్లేషణకు చెందిన యీ చిత్రంలో సముద్రాల సీనియర్ మాటలతో బాటు అర్ధవంతమైన ఆలోచన రేకెత్తించే పాటలు వ్రాసారు. “కనులను దోచి చేతికందని ఎండమావులున్నాయి” గీతంలో స్పష్టివిచిత్రాన్ని విశ్లేషించారు. ఓ బాటసారి నను మరువకోయీ, కనేరా కామాంధులై వంటి గీతాలు మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో భానుమతి గళంలో రాణించాయి. భరణి రామకృష్ణ యీ చిత్ర దర్శకులు. దీనిని తమిళంలో కూడా ‘కానల్ నీర్’ పేరిట నిర్మించారు.

Ramakrishna gave the working title Yendamavulu but later changed it to Batasari and released it on June 30, 1961. However he gave the title Kaanal Neer (Mirages) for the Tamil version which was released on July 21, 1961. ANR, Bhanumathi, Janaki, Devika and Suryakantham enacted their respective roles. Though termed classics, both versions did not do well at the turnstile.

Source: 101 C, S V Ramarao, The Hindu

Spread the love:

Comments