February 5, 2020

Bala Nagamma (1942): The First Blockbuster Hit of Telugu Cinema #TeluguCinemaHistory

Bala Nagamma (1942): The First Blockbuster Hit of Telugu Cinema #TeluguCinemaHistory

ఆంధ్రదేశంలో బుర్రకథ గా ప్రాచుర్యం పొందిన ‘ బాలనాగమ్మ’ కథలో కరుణ రసంతో పాటు అద్భుత రసం కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఒక విధంగా చెప్పాలంటే జానపద చిత్రాల్లో కమర్షియల్ ఎలిమెంట్గా చెప్పుకోదగిన మాంత్రికుడి పాత్రకు ‘బాలనాగమ్మ’ తోనే అంకురార్పణ జరిగింది. మాంత్రికుడి గుహ, దుష్టశక్తులు వశం చేసుకోవడం కథానాయికను లొంగదీసుకోవడానికి ప్రయత్నించడం, విచిత్ర వికటాట్టహాసాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఈ చిత్రంతోనే; అందునా మాయల మరాఠీ పాత్ర ధరించిన డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు తోనే మొదలయింది. ఆ తర్వాత ముక్కామల, ఎస్. వి. రంగారావు, సత్యనారాయణ, రాజనాల, గుమ్మడి, త్యాగరాజు, ధూళిపాళ యధోచితంగా  ఆ పాత్రను పోషించారు.

Click Here to go to Bala Nagamma (1942) Movie Page.

ఆ మహారాజు కు పూజలు చేయటం వల్ల కలిగిన సంతానం లో చివర పిల్ల బాలనాగమ్మ ఆమెకు కార్యవర్థి రాజుతో వివాహమయ్యాక, మాయల మరాఠీ మోసం చేసి ఆమెను తన గుహకు చేర్చి నిర్బంధిస్తాడు. అయితే అంతకు ముందే ఉన్న మరాఠీ ఉంపుడుగత్తె  ‘సంగు’కు ఇది రుచించదు. ఏదో వ్రతం నియమం అంటూ బాలనాగమ్మ 14 సంవత్సరాలు మరాఠీ ని మభ్య పెడుతుంది. ఈ తరువాత పెరిగి పెద్దవాడైన ఆమె కుమారుడు బాలవర్ధి రాజు మరాఠీ ప్రాణ రహస్యం తెలుసుకుని హతమారుస్తాడు. సూక్ష్మంగా ఇదీ కథ.

దీనిని 1942లో తెలుగులో జెమినీ వారు సి.పుల్లయ్య దర్శకత్వంలో నూ శాంత వసుందర సంస్థ ఎస్.వి.ఎస్. రామారావు దర్శకత్వంలో శాంత బాలనాగమ్మ, 1959లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వం లోనూ, 1966లో కన్నడంలో కౌండిన్య దర్శకత్వంలోనూ, 1981లో కే. శంకర్ దర్శకత్వంలో తమిళ, మలయాళ భాషల్లో నిర్మించారు. జెమినీ వాసన్ గారే  హిందీలో బహుత్ దిన్ హాయే’ పేరిట నిర్మించగా సంగు వేషాన్ని సావిత్రి పోషించారు. సత్యనారాయణ- జమున కాంబినేషన్లో తీసిన చిత్రం సగంలో ఆగిపోయింది.

ప్రస్తుతము చర్చిస్తున్న ‘ బాలనాగమ్మ’ చిత్రంలో కాంచనమాల, గోవిందరాజుల సుబ్బారావు, పుష్పవల్లి, బందా కనకలింగేశ్వరరావు, రేలంగి, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, లంక సత్యం, అడ్డాల నారాయణరావు ప్రధాన పాత్రలు పోషించారు.

బలిజేపల్లి లక్ష్మీకాంత కవి మాటలు, పాటల సమకూర్చగా, సైలేన్ బోస్  ఛాయాగ్రహణం నిర్వహించారు. ఎస్.రాజేశ్వరరావు సంగీతం సమకూర్చగా ఎం.డి పార్థసారథి సహకరించారు.

నాటి గ్లామర్ స్టార్ పుష్పవల్లి నటిస్తూ మరులు గొలుపుతూ గానం చేసిన ‘ ఆహా నా సొగసే కని, మరుడే దాసుడు కదా’ అన్న పాట, నాయిక కాంచనమాల పై చిత్రీకరించిన ‘ ఈ వసంత సుమనో వనము’ బందా కనకలింగేశ్వరరావు ( కార్యవర్థి రాజు) చదివిన ” ఇది రక్షా విధి నీకు” అన్న పద్యం చెప్పుకోదగ్గవి. రేలంగి ఈ చిత్రంలో నటించిన తలారి రాముడు పాత్రనే 1959లో కూడా పోషించారు. ఇంతకూ ఈ చిత్రాన్ని అంత రసవత్తరంగా తీర్చిదిద్దిన శిల్పి తారా బ్రహ్మగా పేరొందిన చిత్తజల్లు ( మీసాల) పుల్లయ్య గారు. భారీ సెట్టింగులు, వళ్ళు గగుర్పొడిచే రీ రికార్డింగ్, డాక్టర్ గోవిందరాజుల నటన, కాంచనమాల అందం, పుష్పవల్లి హొయలు, పుల్లయ్య ప్రతిభ ‘ బాలనాగమ్మ’ ను రసవత్తరంగా తీర్చిదిద్ది ‘ జెమిని’ పై కనక వర్షం కురిపించాయి.

The movie was a trendsetting folk-based successful venture and ran for more than 25 weeks in Andhra Pradesh and Tamil Nadu.

Source: 101 C, S V Ramarao

Spread the love:

Comments