బెంగాలీ చిత్రరంగంలో హిట్ పెయిర్ గా పేరొందిన జంట సుచిత్రాసేన్ ఉత్తమకుమార్, వారిద్దరి కంబినేషన్లో 1956లో విడుదలయి విజయవంతమైన బెంగాలీ చిత్రం సాగరిక. దాని ఆధారంగా జగపతి రాజేంద్రప్రసాద్ నిర్మించిన చిత్రం “ఆరాధన”.
Click Here to go to Aradhana (1962) Movie Page.
హీరో కృష్ణ అతని మిత్రుడు సారధి, కధానాయిక అనూరాధ మెడికల్ కాలేజీ విద్యార్థులు. కృష్ణ కష్టపడి పై కొచ్చినవాడుబుద్దిమంతుడు. విదేశాలకెళ్ళి పైచదువులు చదవాలని ఆశ. ఇందుకు తగిన విధంగా సహకరిస్తానంటాడు ప్రిన్సిపాల్. అనూరాధను చూసిన కృష్ణ ఆమెపై అభిమానం పెంచుకొని, మనసులో ఆరాధించి, తన ప్రేమను గీత రూపంలో డైరీలో వ్రాసుకొంటాడు. అంతకుముందు నుంచీ అతన్ని ప్రేమిస్తున్న లక్ష్మి యీ ప్రేమగీతం చూసి అక్కసుతో దానిని అనూరాధకు పంపిస్తుంది. స్నేహిరాళ్ళ మధ్య ఆ గీతం చదివిన అనూరాధ ఉక్రోషంతో ప్రిన్సిపాల్ కు రిపోర్ట్ చేస్తుంది. కృష్ణను విదేశాలకు పంపటానికి అవసరమైన కాగితాలతో సిద్ధంగా వున్న ప్రిన్సిపాల్ కృష్ణ ప్రవర్తనను సందేహించి ఆ కాగితాల్ని చించివేస్తాడు. దాంతో హతాశుడౌతాడు కృష్ణ ఊహించని యీ పరిణామానికి అనూరాధ నివ్వెరపోతుంది.
కథకు కీలకమయిన యీ సన్నివేశాన్ని తెరపై అధ్బుతంగా ఆవిష్కరించారు,దర్శకులు వి.మధుసూదనరావు లక్ష్మి తండ్రి లంగరుచిన లింగయ్య వద్ద కృష్ణ తండ్రి అప్పుచేసి విదేశాలకు పంపిస్తాడు. లక్ష్మిని కృష్ణ పెళ్ళాడాలని షరతు విధిస్తాడు లింగయ్య. విదేశాలకు కెళ్ళిన కృష్ణ తిరిగివచ్చేసరికి అతనికి తగ్గట్టుగా లక్ష్మిని తయారు చేసే బాధ్యతను అనూరాధకు అప్పజెబుతాడు.
అప్పటికే సారథివల్ల నిజం తెలుసుకున్న అనూరాధ కృషకు తన వృదయాని అర్పించి ఆరాధిస్తుంది. లక్ష్మిని మార్చే పరిణామంలో భాగంగా లక్ష్మి కోరికమేరకు లక్ష్మి పేరుతో వుత్తరాలు వ్రాస్తుంది అనూరాధ, అయితే ఆ పుత్తరంలో అనూరాధ ఆంతర్యం అవిష్కరిస్తుంది. ఇలావుండగా ఓ ప్రయోగం చేస్తున్నప్పుడు కృష్ణ కళ్ళు పోయి గుడ్డివాడౌతాడు.
ఇండియాకి తిరిగివచ్చిన కృష్ణను లక్ష్మి పేరుతోనే అనూరాధ సాపర్యాలు చేస్తుంది. ఆమె స్పర్శలో కృష్ణకు ఆత్మీయత కనిపిస్తుంది, అతనికి ఆపరేషన్ చేస్తే చూపువస్తుందనటంతో ఆ ప్రయత్నాలు జరుగుతాయి.
కృష్ణ కళ్ళు తెరచేసరికి లక్ష్మి కన్పిస్తుంది. ఆమెను స్పృశించి ఆమె తన లక్ష్మి కాదని తల్లడిల్లిపోతాడు. అప్పుడు సారధి బలవంతంమీద అనూరాధ కృష్ణకు కనిపిస్తుంది.
అనూరాధ, కృష్ణ యీ రెండు సైకలాజికల్ పాత్రలు. ఇందులో వారిద్దరికీ డ్యూయట్లు లేవు. ఇద్దరూ ఆరాధన తెలుపుకొనే సోలో గీతాల్ని ఆలపిస్తారు. శ్రీశ్రీ వ్రాసిన “నా హృదయంలో నిదురించే చెలీ, వెన్నెలలో నీ వికాసమే” నార్ల చిరంజీవి వ్రాసిన “నీ చెలిమి నేనే కోరితినీ” గీతాలు చిత్రానికి తగ్గట్టుగా హాయి గొలుపుతాయి. ఎస్.రాజేశ్వరరావు అందించిన ట్యూన్లు ఎంతో మృదువుగా వున్నాయి.
రేలంగి-గిరిజ హాస్యజంట వారిపై హాస్యగీతాల్ని ఆరుద్ర, కొసరాజు వ్రాసారు. చిత్రానికి నార్లచిరంజీవి, ఆత్రేయ సంయుక్తంగా సంభాషణలు వ్రాయగా సి.నాగేశ్వరరావు ఛాయాగ్రహణం నిర్వహించారు. ఏ విధమైన అశ్లీలతను తావివ్వకుండా ప్రేమించిన వారి పట్ల నిజమైన ఆరాధన భావం ఎంత హాయినిస్తుందో హృద్యమంగా చిత్రీకరించిన చిత్రం “ఆరాధన”.

The sequence of the song “Ohoho Mamayya” was shot in Gevacolor as it is clearly stated in the censor certificate and the film credits.
Source: 101 C, S V Ramarao