Site icon Best of Telugu Cinema, Telugu Cinema Classics, Tollywood Best Movies, Telugu Cinema

Kula Gotralu (1962): First Film to be Shot at Visakhapatnam | Superstar Krishna’s Debut | #TeluguCinemaHistory

విశాఖనగర సౌందర్యాన్ని, సాగరతీర సౌందర్యాన్ని అత్యధ్భుతంగా తెరపై ఆవిష్కరించిన చిత్రం సి.ఏ.సి. వారి ‘కులగోత్రాలు’. ఈ చిత్రానికి రాష్ట్రపతియోగ్యతా పత్రం లభించింది.

Click Here to go to Kula Gotralu (1962) Movie Page.

పల్లెటూళ్ళో వుండే కామందు భూషయ్య కొడుకు రవి విశాఖపట్నంలో చదువుకొంటున్నాడు. కళాశాల వార్షికోత్సవంలో శకుంతల దుష్యంతుడు నాటకంలో తనతోపాటు కధానాయిక వేషంలో పాల్గొన్న సరోజను రవి ప్రేమిస్తాడు. సరోజ తల్లి చలపతి వల్ల మోసపోయింది. ఆ చలపతి యీరోజున కూతురు మెళ్లో నగదొంగలించి అనుకొని పరిస్థితుల్లో భార్యను కలుసుకుంటాడు. ఆమె హెచ్చరించగా బాధతో వెళ్ళిపోతాడు.

కులగోత్రాలకు పట్టింపుగల భూషయ్య రవి ప్రేమను అంగీకరించడు. సరోజకు యిచ్చిన మాట ప్రకారం రవి ఇల్లు వదలి తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా సరోజను గుళ్ళో పెళ్ళి చేసుకొంటాడు. సరోజ తల్లి ఆశీర్వదిస్తుంది.

రవికి పోలీస్ యిన్ స్టెక్టరుగా వున్నవూళ్ళోనే వుద్యోగం వస్తుంది. రవి తన బావ (రేలంగి) యితర స్నేహితులతో కలసి పేకాడుతుంటే వాళ్ళను అరెస్టు చేస్తాడు. వాళ్ళకు జామీను మీద విడుదలౌతారు. తండ్రి పట్టింపుల వల్ల రవి తన చెల్లెలి పెళ్ళికి కూడా వెళ్ళలేక యింటి బయటనుంచే అక్షింతలు వేస్తాడు.

రవిని తల్చుకొని అతని తల్లి బాధపడి అనారోగ్యంతో మంచం పట్టి మరణిస్తుంది. భార్య గతించాక భూషయ్యలో మార్పు వస్తుంది. రవికి కొడుకు పుడతాడు. భూషయ్య మమతను చంపుకోలేక దొంగచాటుగా వెళ్ళి మనవాణ్లి చూసి ఎత్తుకొని ముచ్చటపడి వాడి మెడలో బంగారు గొలుసు కానుకగా వేస్తాడు. చలపతి భూషయ్య యింట్లో పడి దొంగతనం చేసే ప్రయత్నంలో వుండగా రవి వచ్చి రక్షిస్తాడు. పంతాలు పట్టింపులు వదలి భూషయ్య కొడుకు, కోడలు, మనవణ్ణి యింట్లోకి ఆహ్వానిస్తాడు.

ఆచార్య ఆత్రేయ వ్రాసిన సంభాషణలు చిత్రానికి ప్రాణం పోసాయి. అక్కినేనికి తొలిసారిగా సి.నారాయణరెడ్డి యీ చిత్రానికి రెండు యుగళగీతాలు వ్రాసారు. అవి “చెలికాడు నిన్నే రమ్మనిపిలువ, చిలిపికనుల తీయని చెలికాడ”. భాంగ్రా టైపు నృత్యాన్ని (ఓ వన్నెల చిన్నెల కన్నియ) కొత్తగా ప్రవేశపెట్టారు. పేకాట వ్యసనంపై కొసరాజు వ్రాసిన అయ్యొయ్యో చేతిలో నేటికీ శ్రోతల్ని అలరిస్తూనే వున్నాయి. భూషయ్య షష్ఠి పూర్తి సందర్భంగా మీసాల మీద కోసరాజు వ్రాసిన పద్యాలు గిలిగింతలు పెడతాయి.

ప్రధాన పాత్రలను నాగేశ్వరరావు, కృష్ణకుమారి, గుమ్మడి, జి.వరలక్ష్మి పోషించారు. రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, గిరిజ, సూర్యకాంతం, సంధ్య, మిక్కిలినేని సహాయపాత్రల్ని పోషించారు.

ఈ చిత్రానికి కెమెరామన్ విన్సెంట్ పెద్ద ఎసెట్. విశాఖ సాగర సౌందర్యాన్ని పాటల్లోనూ, కొన్ని సన్నివేశాల్లోనూ రసవత్తరంగా చిత్రీకరించారు. కుటుంబ కథా చిత్రంలో మెలోడ్రామాను పండించటంలో సఫలీకృతులయ్యారు దర్శకులు ప్రత్యగాత్మ.

The film won the National Film Award for Best Feature Film in Telugu certificate of merit in 1963. The Telugu veteran actor Krishna played a sidekick role in the movie before entering into the industry. It is the first film to be shot at Visakhapatnam. It is subsequently followed by Anthu leni Kadha (1976), Maro Charitra (1978), Driver Ramudu (1979) and many more.

Source: 101 C, S V Ramarao, Wiki

Spread the love: