అక్కినేని, యన్.టి.ఆర్, ఎస్.వి.ఆర్, సావిత్రి, జమున వంటి హేమాహేమీలు వుండునా సూర్యకాంతం పాత్ర (గుండమ్మ)ను టైటిల్ గా నిర్ణయించటంలోనే విజయవారి సాహసం దాని వెనుకవున్న నమ్మకం తెలుస్తుంది. టైటిల్ పెట్టక ముందు షూటింగ్ నాడు ఆ గుండమ్మ చిత్రం ఎంతవరకూ వచ్చిందని అందరు అనుకోవడంతో యిదేదో కొత్తగా వుందనే భావంతో గుండమ్మ కథ” టైటిల్ను ఖరారు చేశారు.
Click Here to go to Gundamma Katha (1962) Movie Page.
తలచెడిన గుండమ్మకు సొంత కూతురు సరోజ, మారిటి కూతురు లక్ష్మి. సరోజ గారాలా కూతురు కాగా, ఇంటి పనిమనిషి తరహాలో బ్రతకాల్సొస్తుంది లక్ష్మి.
గుండమ్మ భర్త చవిపోయిన వెంకట్రామయ్యకు మిత్రుడు రామభద్రయ్య. ఆయనకు యిద్దరు కొడుకులు ఆంజనేయులు, రాజు. గుండమ్మ కూతుళ్ళలో ఒకదాన్ని తన కొడుక్కి యిచ్చి పెళ్ళి చేసి అస్తి కాజేయాలని గుండమ్మకు వరసకు అన్నయ్య అయిన గంటయ్య ఆలోచన.
ఈ సంగతులు తెలుసుకొన్న రామభద్రయ్య తన స్నేహితుడి ఆత్మశాంతి కోసం తన పిల్లలు గుండమ్మ కూతుళ్ళను పెళ్ళి చేసుకొంటే బాగుండునని ఆశిస్తాడు.
తండ్రి కోరిక నెరవేర్చటానికి ఆంజనేయులు అంజిగా, గుండమ్మ యింట్లో ప్రవేశిస్తాడు. గుండమ్మని వొప్పించి లక్ష్మిని పెళ్ళి చేసుకొంటాడు. కొంచెం పెంకితనం మరికొంత పొగరు గల సరోజను రాజా ప్రేమించి పెళ్ళాడి ఒక తాగుబోతుగా దొంగగా నటించి ఆమెలో మార్పు తీసుకు వస్తాడు. ఇంతలో గుండమ్మ కొడుకు హరనాథ్, నర్తకి విజయలక్ష్మిల ప్రేమకథ కొంత.
కథాకథనంలో హాస్యం అంతర్లీనంగా వుండి ప్రతి సన్నివేశమూ నిండుగా హాయిగా నవ్వుకునేలా చేస్తుంది. మాటలు పాత్రోచితంగా ముఖ్యంగా అంజికి వాడిన భాష గిలిగింతలు పెడుతుంది. ‘ఏం నీకు పిల్ల నిచ్చినవాడు నాకెందుకివ్వడు! నీకంటె యెదవనా నేను, ఇదుగో గంటన్నా నాకసలే తిక్కరేగిందంటే నీ వీపు పంబరేగుద్ది” అంటాడు యన్.టి.ఆర్. అలాగే ‘కోలుకోలులోయన్న’ పాటకు ఆయన వేసిన చిందులు మరచిపోలేం.
ఈ చిత్రానికి ప్రాణం డి.వి.నరసరాజు స్క్రిప్ట్. అంతటి గొప్పగాను తెరపై ఆవిష్కరించిన దర్శకులు కమలాకర కామేశ్వరరావు, అన్నదమ్ములుగా యన్.టి.ఆర్ అక్కినేని, వారి తండ్రిగా రంగారావు, అక్కచెల్లెళ్ళుగా సావిత్రి, జమున వారి తల్లిగా సూర్యకాంతం, దుష్టపాత్రదారులుగా రమణారెడ్డి, ఛాయాదేవి, రాజనాల – ఆ చిత్రాన్ని చిరస్మరణీయం చేసారు.
మిక్కిలినేని, అల్లూరి రామలింగయ్య, బాలకృష్ణ సహాయ పాత్రల్లో రాణించారు. నాటికీ నేటికీ ఈ చిత్రంలోని ప్రతీపాట హిట్. పింగళి వారి గీతరచన ఘంటసాల సంగీత రచన అందమైన కాంబినేషన్! ఆ పాటలు వింటూంటే మనసు హాయితో నిండిపోతుంది. అలిగిన వేళనే చూడాలి అన్న పాటకు యన్.టి.ఆర్ చూపిన రియాక్షన్ గోముగా ముచ్చటగా వుంటుంది. ఆ పాట భావానికి తగ్గట్టు కళాదర్శకులు గోఖలే కళాధర్ వేసిన పెయిటింగ్స్ కనువిందు చేస్తాయి. చూస్తే తెరమీద నిండు పున్నమి నాటి చందమామను చూడాలి. అది విజయావారి చిత్రాలపై స్పెషాలిటి. అందుకు కెమెరామన్ మార్కస్ బార్ ట్లేను ప్రతేకించి ప్రశంసించాలి.
కేవలం మ్యూజిక్తో సాగే యల్.విజయలక్ష్మి నృత్యాన్ని నేత్ర పర్వంగా వుండేలా భంగిమలు సమకూర్చారు నృత్యదర్శకులు పసుమర్తి కృష్ణమూర్తి. విజయ నాగిరెడ్డి చక్రపాణిల సంయుక్త విజయం గుండమ్మ కథ. ఈ చిత్రం తమిళ వెర్షన్ “మణిదన్ మారవిల్లె”ను చక్రపాణి దర్శకత్వం వహించారు. తెలుగు చిత్రం “గుండమ్మ కథ” యన్.టి.ఆర్ కు నూరవ చిత్రంకాగా, తమిళ వెర్షన్ “మణిదన్ మారవిల్లె” అక్కినేని నాగేశ్వరరావుకి నూరవ చిత్రం.
A few days before the release of Gundamma Katha, the wedding reception of L.V. Prasad’s daughter was held at Vijaya Gardens. Vyjayanthimala who was to perform a dance was held up at Coimbatore. Not to disappoint the guests, Chakrapani brought an incomplete rerecording print of Gundamma Katha from the recording theatre and showed to the guests. This no producer would normally do.
The Herald (MSW 6009) car that ANR drives in the movie belonged to Nagi Reddi’s sons, B. Venugopala Reddi and B. Viswanatha Reddi. For the shooting purpose the car was made topless at Nagi Reddi’s garage as Herald did not manufacture a topless car then.
It was Nagi Reddi’s Ford Mercury car which NTR drives and in which he gives lift to ANR and Jamuna.
Gundamma Katha was NTR’s 100th film and interestingly its Tamil version, Manithan Maaravillai (Gemini Ganesan played NTR’s role) which was shot simultaneously with Chakrapani as the director was ANR’s 100th starrer.
In the titles, instead of the names of the actors their photographs were carried side by side with NTR on the left and ANR on the right and then the rest of the top actors.
Released on June 7, 1962, Gundamma Katha celebrated hundred days in many centres and a silver jubilee run in Vijayawada. The money intended to be spent for the celebrations was donated by Nagi Reddi to the National Defence Fund as the China war was on at that time.
Source: 101 C, S V Ramarao, The Hindu