Site icon Best of Telugu Cinema, Telugu Cinema Classics, Tollywood Best Movies, Telugu Cinema

Gulebakavali Katha (1962): First Folklore Fantasy Film #TeluguCinemaHistory

సింహాసనం కోసం జరిగే పోరాటాల్లో బందుత్వావికి, ఆత్మీయతకు, రక్తబంధాలకు తావిలేదు, అందుకు సంబంధించిన కథల్లో మలుపులు, సస్పెన్స్ వుంటే ఆ చిత్రం విజయవంతమైనట్టే!

Click Here to go to Gulebakavali Katha (1962) Movie Page.

ఆ మహారాజుకు ఇద్దరు భార్యలు. రెండో భార్యకు అసమర్థులయిన ముగ్గురు కొడుకులు, ఒక సిద్దుని వరంచే పెద్ద భార్యగర్భవతి అవుతుంది. అయితే ఆమెకు పుట్టిన బిడ్డ వల్ల చూపుపోతుందని తెలుసుకున్న మహారాజు ఆమెను అడవులకు పంపిస్తాడు. అక్కడ ఆమెకు జన్మించిన కుమారుడు విజయుడు కథానాయుకుడు. కోయగూడెంలో పెరిగి పెద్దవాడవుతాడు.

మహారాణి తమ్ముడు రాజ్యాధికారం కోసం ఎత్తులు వేస్తూంటాడు, ఇంతలో రాజుకు కళ్ళుపోతాయి, ‘గుళేబకావళి పుష్పం తెచ్చి రాజుకన్నులకు తాకిస్తే చూపువస్తుందని తెలియటంతో దానిని తేవటానికి ముగ్గురు మూర్ఖులు(చిన్నభార్య కొడుకులు) బయలుదేరుతారు. విజయుడు కూడా ప్రయాణమవుతాడు.

దోవలో యుక్తమతి అనే వగలాడి వేసిన పావుల పందెంలో అన్నలు ముగ్గురు ఓడిపోయి బందీలవుతారు. విజయుడు మారువేషంలో పందెంలో పాల్గొని ఆమెను ఓడిస్తాడు. ఫలితంగా ఆమె తన మనస్సుని అర్పించి సోదరులని విడుదల చేస్తుంది.

విజయుడు గుళేబకావళి పుష్పాన్ని సాధించి తెస్తుండగా సోదరులు దానిని  తస్కరించి విజయుడిని బావిలో పడవేసి రాజ్యానికి చేరుతారు. బావిలోంచి బయటపడ్డ విజయుడు ఒక తాపసి సహాయంతో తిరిగి గుళేబకావళి పుష్పాన్ని సాధించటమేకాక,పెళ్ళిచేసుకొంటాడు.

రాజ్యానికి వచ్చిన అన్నల పెట్టెలో పుష్పానికి బదులు చీపురు కట్ట వుండటం చూసి ఆశ్చర్యపోతారు. విజయుడు సమయానికి వచ్చి తండ్రికి చూపు తెప్పించటమే గాక వక్రకేతువుతో పోరాడి అంతమొందిస్తాడు. హీరో విజయునిగా యన్.టి.ఆర్, కధానాయికలుగా జమున, నాగరత్నం. విలన్ వక్రకేతుగా రాజనాల నటించారు. ఇతర పాత్రల్ని ముక్కామల, ఋష్యేంద్రమణి లంకసత్యం, పేకేటి, బాలకృష్ణ, పద్మనాభం పోషించారు.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక విశేషం – అంతకుముందు ఒకటి రెండు చిత్రాలకు ఒకటిరెండు పాటలు వ్రాసే అవకాశం వచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరించి యన్.టి.ఆర్ అనే సింహద్వారం ద్వారా యీ చిత్రంలో అన్ని పాటలు వ్రాసి గీతారచయితగా సినీ రంగప్రవేశం చేసారు డా||సి.నారాయణరెడ్డి, పాటలన్నీ వైవిధ్యంతో కూడుకొన్నవే!

కథ ప్రారంభంలో వచ్చే “ఉన్నది చెబుతా వింటారా” నృత్యగీతం, “నన్ను దోచుకుందవటె, కలల అలలపై తేలెను” అన్న యుగళగీతాలు “ఒంటరినైపోయాను విషాదగీతం జావళీ తరహాలో సాగిన “మదనా సుందర నా దొర” నృత్యగీతం సలామలేకుం సాయిబుగారు”” హాస్య గీతం – ఇవన్నీ సి.నా.రెలోని బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకలూ.

జోసఫ్-కృష్ణమూర్తి సంయుక్తంగా సంగీతాన్ని అందించారు. మాటలు జానియర్ సముద్రాల వ్రాసారు.

కథానాయకుడు అస్థిపంజరాలతో పోరాడటం, క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఎనిమిది విశెల కత్తులతో యన్.టి.ఆర్, రాజనాల పోరాటం యీ చిత్రంలో ప్రత్యేకించి చెప్పుకొదగిన ఆంశాలు. రసవంతమైన ఈ కథను మూకీ చిత్రంగా ఒకసారి (1924) హిందీలో రెండుసార్లు (1932,1963) తమిళంలో రెండుసార్లు (1935,1955) పంజాబిలో ఒకసారి (1939), తెలుగులో రెండుసార్లు(1938,1962) నిర్మించారు.

Gulebakavali was first made in Telugu in 1938 by director Kallakoori Sadasiva Rao for producer Kekubhai Desai’s Paramount Film company, Bombay with Sakunthala and Mithipati Buchi Kameswara Rao in the lead. It was also the first folklore fantasy film in Telugu.

Source: 101 C, S V Ramarao, The Hindu

Spread the love: