Site icon Best of Telugu Cinema, Telugu Cinema Classics, Tollywood Best Movies, Telugu Cinema

Gruhalakshmi (1937): The Inspirational Film To Many Filmmakers #TeluguCinemaHistory

టాకీలు వచ్చిన తొలిదశకంలో (1931-40) మొత్తం 60 చిత్రాలు విడుదల కాగా అందులో కేవలం 15 మాత్రమే సాంఘికాచిత్రాలు. వాటిల్లో ఒకవిధంగా చెప్పాలంటే సంచలనం సృష్టించిన చిత్రం రోహిణి పథకంపై H.M. రెడ్డి స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘గృహలక్ష్మి’, సామాజిక స్పృహతో తీసిన తొలి చిత్రంగా దీనిని పేర్కొనాలి. ఆ తర్వాత అటు సారధీవారు, ఇటు వాహినివారు సాంఘిక చిత్రాలు నిర్మించటానికి ఈ చిత్రం ప్రేరణ అని చెప్పాలి.

సముద్రాల రాఘవాచార్య రచన, ప్రభల సత్యనారాయణ సంగీతం అందించిన ఈ చిత్రానికి K. రామనాథ్.

కన్నాంబ, కాంచనమాల, సరళ, మోహిని,రామానుజాచారి,నాగయ్య,గౌరీపతిశాస్త్రీ, ప్రధానపాత్రలు పోషించారు.

నర్తకి మాధురిని ప్రేమించిన డాక్టర్ కృష్ణారావు తన భార్య రాధను నిర్లక్ష్యం చేస్తాడు. తాగుడుకు బానిస అయినా కథానాయకుడు కృష్ణారావుపై విశ్వేశ్వరరావు అనే వ్యక్తిని హత్యచేసినట్లు అభియోగం మోపబడుతుంది.

Click Here to go to Gruhalakshmi (1938) Movie Page.

సాంఘిక సంస్కరణ పట్ల శ్రద్ధ చూపే డాక్టర్ బావమరిది గోపినాథ్ రాధను చేరదీసి ఆదుకుంటాడు. మాధురితొ గొడవపడిన సందర్భంగా రాధా మతిస్థిమితం కోల్పోతుంది.

తనకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ రాధా మద్రాసు వీధుల్లో పరుగెడుతూ ‘దేవుడు లేడు, న్యాయం, ధర్మంలేవు’ అంటూ ఆక్రోశిస్తుంది. ఈ సన్నివేశంలో మతిచెలించిన రాధగా కన్నాంబ చూపిన నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. అలాగే గోపినాథ్ పాత్రలో నాగయ్య పాడిన ‘కల్లు మానండోయ్ బాబు, కళ్ళు తెరవండోయ్, భారత వీరులారా’ అన్న పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 

అటు దేశభక్తి, ఇటు సమాజం పట్ల ఉన్న బాధ్యతలు రెండింటికి ప్రాధాన్యత ఇచ్చి నిర్మించిన ‘గృహలక్ష్మి’ విజయం సాధించడంలో ఆశ్చర్యమేముంది. జనచైతన్యానికి శక్తివంతమైన మాధ్యమం ‘సినిమా’ అని నిరూపించిన ఈ చిత్ర దర్శకుడు H.M. రెడ్డి ప్రాతఃస్మరణీయుడు.

H.M. రెడ్డి స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘గృహలక్ష్మి’, సామాజిక స్పృహతో తీసిన తొలి చిత్రంగా దీనిని పేర్కొనాలి. ఆ తర్వాత అటు సారధీవారు, ఇటు వాహినివారు సాంఘిక చిత్రాలు నిర్మించటానికి ఈ చిత్రం ప్రేరణ అని చెప్పాలి.

Source: 101 C, S V Ramarao

Spread the love: