Site icon Best of Telugu Cinema, Telugu Cinema Classics, Tollywood Best Movies, Telugu Cinema

Chakrapani (1954): Reminiscence of Telugu Cinema #TeluguCinemaHistory

ఆధ్యంతం హాస్యాన్ని అందించే చక్రపాణి, భక్తిశృంగార రసప్రధానమైన విప్రనారాయణ, ఈ రెండు చిత్రాల్ని స్వీయదర్శకత్వంలో నిర్మించి, ఒకే సంవత్సరం విడుదల చేసి తన సమర్థతను నిరూపించుకున్న వ్యక్తి భరణి అధినేత రామకృష్ణారావు. ఈ రెండు చిత్రాల్లోనూ ప్రధానపాత్రల్ని అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి పోషించారు.

Click Here to go to Chakrapani (1954) Movie Page.

ఆ వివరాలను పరిశీలిస్తే….

19.3.1954 న విడుదలైన చిత్రం ‘చక్రపాణి’. టైటిల్ రోల్ పోషించింది సి.ఎస్.ఆర్. ఆంజనేయులు. ఆయన కొడుకు ఎప్పుడో ఇల్లు వదిలివెళ్ళిపోయాడు. ఇద్దరు కూతుళ్లతో ఎవరు ముందు మనవణ్ణి ఇస్తే వారికి లక్షరూపాయలు అని ప్రకటిస్తాడు. మొదటి కుమార్తెకు ఆడపిల్ల, రెండో కుమార్తె మాలతి (భానుమతి). ఎలాగైనా లక్ష సంపాదించాలని స్నేహితురాలు మనోరమ (సూర్యకాంతం) సలహాపై ఎదురింట్లో ఉన్న బాబును తీసుకొచ్చి తండ్రికి తన కొడుకుగా చెబుతుంది. భర్త చలం (అక్కినేని) పొరుగూరు వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేలోగ మరొకర్ని (అమర్నాథ్) భర్తగా సెటప్ చేస్తుంది. అసలు భర్త చలం వచ్చాక ఆగటాన్ని వంటవాడిగా పరిచయమా చేస్తుంది.

సెటప్ చేసిన భర్తకు ఒరిజినల్ భర్తకు మధ్య కాసేపు గందరగోళం, ఘర్షణ, లక్షకోసం కాసేపు ఓర్చుకోమని భర్తని మాలతి కోరుతుంది. ఇంతలో ఆ పసివాడు ఆమె కొడుకు కాదన్న విషయం ముసలాయనకు తెలుస్తుంది. అంతేకాదు వాడు ఏనాడో దూరమైనా తన కొడుకు సంతానం అని తెలుస్తుంది. ఈ విధంగా కథంతా కామెడీ అఫ్ ఎర్రర్స్గా కొనసాగుతుంది.

రావూరి సత్యనారాయణరావు మాటలు, పాటలు రాయగా భానుమతి సంగీతాన్ని సమకూర్చారు. ‘చల్లచల్లగా మెల్లమెల్లగా రావె నిదురా హాయిగా’,’పక్కన నిలబడి’, ‘ఉయ్యాల జంపాలలూగరవయా’, ‘నన్ను చూసి ఇంట జాలీయేలునమ్మ మాలతి’ (ఇవన్నీ భానుమతి పాడినవే), ఎ.యుమ్. రాజా పాడిన ‘ఓ ప్రియురాలా ఓ జవరాల’ ఎంతో హాయిగా ఉంటాయి. ఇతర ముఖ్యపాత్రల్లో ఛాయాదేవి, రమణారెడ్డి, టి.జి. కమలాదేవి, వంగర, చంద్రశేఖర్, డాక్టర్ శివరామకృష్ణయ్య రాణించారు. సెల్వరాజ్ ఫోటోగ్రఫీ నిర్వహించారు.

Source: 101 C, S V Ramarao

Spread the love:
Exit mobile version